S. S. Rajamouli

S. S. Rajamouli: శ్రీసింహా పెళ్ళిలో డాన్స్ తో అదరగొట్టిన రాజమౌళి

S. S. Rajamouli: సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ కీరవాణి కుమారుడు శ్రీసింహా వివాహం దుబాయ్ లో జరిగింది. ఈ సందర్భంగా అన్న కుమారుడి పెళ్ళిలో రాజమౌళి చేసిన డాన్స్ లు తెగ వైరల్ అవుతున్నాయి. సతీమణి రమతో కలసి సంగీత్ లో ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’లో ‘లంచ్ కొస్తావా ‘ పాటకు డాన్స్ చేసి అలరించారు. (ఇక్కడ ఆ డాన్స్ స్టెప్స్ ప్లే చేయాలి). ఇక పెళ్ళికి ముందు కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవతో కలసి ‘దేవర’ మూవీలోని ఆయుధ పూజ సాంగ్ కి ఊరమాస్ స్టెప్స్ వేసన వీడియో అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి: Upendra: ఉపేంద్ర సినిమాకు రెండు క్లయిమాక్స్ లు

S. S. Rajamouli: ఇందులో ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ ను రీ క్రియేట్ చేశారు రాజమౌళి. ఎన్టీఆర్ లాగే షర్ట్ ను నోట కరచుకుని భైరవతో కలసి స్టెప్స్ వేశాడు. నిజానికి తన కుమారుడు కార్తికేయ వివాహంలోనే రాజమౌళిలోని డాన్సింగ్ టాలెంట్ బయటకు వచ్చింది. అప్పుడు కూడా సూపర్ హిట్ పాటలకు డాన్స్ చేసి ఇరగదీశారు రాజమౌళి. ఇక పెళ్ళికొడుకు శ్రీసింహా ఎన్టీఆర్ ‘యమదొంగ’లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత ‘మత్తువదలరా’తో హీరోగా మారాడు. వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న శ్రీసింహా తాజాగా ‘మత్తువదలరా2’తో ఆడియన్స్ ను మెప్పించాడు. సీనియర్ ఆర్టిస్ట్ మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో శీసింహా వివాహం జరగటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *