Game Changer

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ కోసం రంగంలోకి రాజమౌళి, సుక్కు!

Game Changer: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో భారీ ఈవెంట్స్ ను నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘పుష్ప-2’ మూవీ అతి తక్కువ రోజుల్లో వెయ్యి కోట్ల గ్రాస్ ను వసూలు చేయడంతో సహజంగానే శంకర్ డైరెక్ట్ చేసిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమౌతున్న శంకర్ ‘గేమ్ ఛేంజర్’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని అంతా భావిస్తున్నారు.

Game Changer: ఈ నేపథ్యంలో ఈ నెల 21న అంటే సినిమా విడుదలకు ఇరవై రోజుల ముందే అమెరికాలో ప్రమోషన్స్ ను మొదలు పెడుతున్నారు. అక్కడ జరిగే ఈవెంట్ కు దర్శకుడు సుకుమార్ గెస్ట్ గా హాజరవుతాడని తెలుస్తోంది. ఆయన కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇదే సమయంలో సినిమా విడుదలకు ముందు హైదరాబాద్ లో నిర్వహించే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రాజమౌళిని ఆహ్వానిస్తున్నారని సమాచారం. రామ్ చరణ్ తో సుకుమార్ ‘రంగస్థలం’ చిత్రాన్ని రూపొందించగా, రాజమౌళి ‘మగధీర, ట్రిపుల్ ఆర్’ చిత్రాలను తెరకెక్కించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *