Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు అయిన అల్లు అర్జున్‌కు సినీ లోకం నుంచి మద్దతు లభించింది. ఆయన అరెస్టు సరికాదని, ఈ ఘటనలో ఆయనను ఒక్కడినే బాధ్యుడిని చేయడం భావ్యం కాదని సినీ ప్రముఖులు పేర్కొన్నారు. పుష్ప 2 సినిమా భారీ వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న తరుణంలో అరెస్టు చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు.
అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం: బాలకృష్ణ
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమని సినీ నటుడు, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఇలా అరెస్టు చేయడం సరికాదని, ఆయనకు మేమంతా అండగా ఉంటామని, చిత్రపరిశ్రమ కూడా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదు: నాని
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనకు అల్లు అర్జున్‌ను ఒక్కడినే బాధ్యుడిని చేయడం సబబు కాదని సినీ నటుడు నాని పేర్కొన్నారు. సినిమా వాళ్ల విషయంలో ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే చొరవ సాధారణ పౌరులపైనా ఉండాలని హితవు పలికారు.
నిందలతో నిజాన్ని కప్పివేయలేం: అనిల్ రావిపూడి
Allu Arjun: నిందలతో నిజాన్ని కప్పివేయలేమని ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నదని తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో అల్లు అర్జున్ బాధ్యతగా వ్యవహరించారని తెలిపారు. మెరుగైన భద్రత లేకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని తెలిపారు.
ఒక్కడినే బాధ్యుడిని చేస్తారా?: రష్మిక మందన్న
Allu Arjun: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ ఒక్కరినే బాధ్యుడిని ఎలా చేస్తారని పుష్ప 2 సినిమా హీరోయిన్ రష్మక మందన్న ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో బన్నీని ఇబ్బంది పెట్టడం సబబు కాదని పేర్కొన్నారు. ఘటన దురదృష్టకరమని, కానీ ఈ పరిణామాలు హృదయాన్ని కలచి వేస్తున్నాయని బాధను వ్యక్తం చేశారు.
ఒక్క వ్యక్తికే తప్పును ఆపాదిస్తారా?: నితిన్
Allu Arjun: విషాదకరమైన ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి, ఒక్క వ్యక్తికే తప్పును ఆపాదించడం సరికాదని సినీ నటుడు నితిన్ అభిప్రాయపడ్డారు. అందరూ సమిష్టి బాధ్యత తీసుకుంటే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగబోవని పేర్కొన్నారు.
భద్రతా ఏర్పాట్లు పోలీసుల పనే: వర్మ
Allu Arjun: భద్రతా ఏర్పాట్లను పోలీసులే చూసుకోవాలని, సినిమా హీరోలు, నాయకులు వాటిని ఎలా మేనేజ్ చేయగలరు అని సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. అభిమానుల్లో ఎవరైనా పోతే నటుడు ఎలా బాధ్యుడు అవుతాడని, ఎన్నికల సభల్లో తొక్కిసలాట జరిగితే ఆ నాయకున్ని అరెస్టు చేస్తారా? పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు వేళల తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్టు చేస్తరా? అంటూ నాలుగు ప్రశ్నలను సంధించారు.
ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం: వరుణ్ ధావన్
Allu Arjun: తొక్కిసలాట ఘటనలకు ఒక్క వ్యక్తినే లక్ష్యంగా చేసుకోవడం బాధాకరమని బాలీవుడ్ నటుడు వరుణ్‌ధావన్ పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో భద్రతాపరమైన అంశాలను నటీనటులు ఒక్కరే చూసుకోలేరని తెలిపారు. తమ పక్కనున్న వారికి చెప్తారని తెలిపారు.

