Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన ప్రముఖులు.. ఎవరేమన్నారంటే..
సీఎం రేవంత్ రెడ్డి ఇలా అన్నారు..
Allu Arjun Arrest: అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు చట్టం ముందు అందరూ సమానులే చట్టపరమైన ప్రక్రియ జరుగుతుంది తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయి క్యాబినెట్ విస్తరణపై చర్చ లేదు ఓవైపు సీరియస్‌గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఇంకో వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి క్యాబినెట్ విస్తరణ జరగాలంటే పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, ముఖ్యనేతలతో చర్చలు జరగాలి.
కేటీఆర్ ఇలా అన్నారు..
Allu Arjun Arrest: జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతా భావానికి ఇది పరాకాష్ట ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయడం సరికాదు ప్రభుత్వ చర్యను ఖండిస్తున్న హైడ్రా కూల్చివేతలతో ఇద్దిరి చావుకు బాధ్యుడైన..రేవంత్‌రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్ట్ చేయాలి.
హరీష్‌రావు ఇలా అన్నారు..
Allu Arjun Arrest: అసుల బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? ముందుస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? తొక్కిసలాటలో మహిళ రేవతి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం హరీష్‌రావు దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే..చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే.
రాజాసింగ్ ఇలా అన్నారు..
Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడు కాదు జాతీయ అవార్డు సాధించి అల్లు అర్జున్ మన ప్రతిష్ఠ పెంచారు అల్లు అర్జున్ నేరస్తుడిగా చూడటం సరికాదు.
బండి సంజయ్ ఇలా అన్నారు..
Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు తీరు సరికాదు నేరుగా బెడ్‌రూమ్‌కు వచ్చి అరెస్టు చేస్తారా? బట్టలు మార్చుకోనివ్వకుండా అరెస్ట్ చేస్తారా?అర్జున్ ఇండియా సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు తొక్కిసలాట ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అల్లు అర్జున్‌కు గౌరవం ఇవ్వాలి.. నేరస్తుడిగా చూడొద్దు.
