Telangana

Telangana: మంచిర్యాల జిల్లాలో ఉపాధ్యాయుడు భాగోతం

Telangana: శుభోదయం, తెల్లారింది..స్కూళ్ళు తెరుచుకున్నాయి. స్టూడెంట్స్ వచ్చారు. పాఠాలు చెప్పే పంతుళ్లు కూడా వచ్చారు. అంతా కామ్ గానే ఉంది,. అంతలోనే …చెప్పు పైకి లేసింది. పటేల్ మని ఓ చెంప పగిలింది. పట్టుకుని…ఉతుకుడే ఉతుకుడు ..మొత్తానికి అలా జరిగింది ఆ స్కూల్ వద్ద .

మంచిర్యాల జిల్లాలో మరో ఉపాధ్యాయుడు భాగోతం బయట పడింది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో జరిగింది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సత్యనారాయణకు పాఠశాలకు వచ్చిన విద్యార్థినుల తల్లిదండ్రులు మార్కెట్ ఏరియాలో చెప్పులతో కొట్టారు. దీంతో టీచర్ గోడ దూకి పారిపోయాడు. ఆగ్రహం ఉన్న తల్లిదండ్రులు సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telangana: కీచక గురువుకు చెప్పులతో కొట్టిన ఘటన మంచిర్యాల జిల్లాలో బాలికల పాఠశాలలో సంచలనం సృష్టించింది. బాలికల పాఠశాలలో తెలుగు బోధిస్తున్నాడు ఉపాధ్యాయుడు సత్యనారాయణ. తరగతి గదిలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూనే మానసిక ఇబ్బందులకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈ విషయాన్ని కొందరు విద్యార్థినులు ముందుగా ఉపాధ్యాయులకు చెప్పారు. వారు ఏ విధంగా స్పందించలేదు. దీంతో ఆయన అడగడంతో ఉపాధ్యాయుడు మితిమీరి విద్యార్థినుల పట్ల ఇంకా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

అంతేకాకుండా మద్యం సేవించి పాఠశాలకు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. సత్యనారాయణ మాటలు భరించలేదని విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. ఆగ్రహించిన పలువురు తల్లులు పాఠశాలకు వచ్చి టీచర్‌ని నిలదీశారు. గోడ దూకి పారిపోబోయిన ఉపాధ్యాయుడిని పాఠశాల బయట పట్టుకొని చెప్పులతో కొట్టి గట్టిగా సన్మానించారు. రోడ్డుపైనే చితక బాదుతున్న మహిళలు నుంచి తన తప్పుపై క్షమించమని వేడుకున్నాడు. కోపంతో ఉన్న మహిళలు చెప్పులతో ఉపాధ్యాయుడిని చితక బాదారు. డీఈవోకి ఫిర్యాదు చేశారు. విచారణ తర్వాత సస్పెండ్‌ చేస్తామని డీఈవో తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  YS Sharmila: అదానీ దేశం పరువు తీస్తే.. జగన్‌ ఏపీ పరువు తీశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *