Gautam Gambhir: ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు అనంతరం వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తిరిగి జట్టుతో కలవనున్నాడు. అతడు మంగళవారం ఆసీస్ గడ్డపై అడుగుపెడుతున్నాడు. శుక్రవారం అడిలైడ్‌లో మొదలయ్యే రెండో టెస్టులో గంభీర్ జట్టుకు సేవలందించనున్నాడు. ఈ టెస్టు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబి బంతితో జరగబోతోంది. గౌతి లేకపోయినా భారత జట్టు కోచ్ బృందం అభిషేక్ నయ్యర్, ర్యాన్ టెన్ డస్కాటె, మోర్నీ మోర్కెల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆ లోటు లేకుండా పూరించారు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పీఎం ఎలెవన్ జట్టును ఓడించింది.
