Jeevan reddy: కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ ఓర్వలేక పోతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ నేతలు మమ్మల్ని విమర్శించే కంటే ముందు మీరు ఆత్మ విమర్శ చేసుకోండి అని తెలిపారు. 20 వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసింది వాస్తవం కదా..? హరీష్ రావు.. మీరు చేసింది ఎంత..? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉచిత బస్ రవాణా ఇస్తున్నారా?.. రైతు రుణాలు మాఫీ చేశారా?.. అని ప్రశ్నించారు. కానీ మేము వరి బోనస్ ఇచ్చి కొంటున్నామన్నారు.
బీజేపీ వాళ్లు కూడా మమ్మల్ని ఏం చేస్తున్నారు అని అడుగుతుంటే విచిత్రం అనిపిస్తుంది.. కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తున్నామని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సన్న రకాల వడ్లకు బోనస్ ఇస్తుంది.. బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు మరింత ఎక్కువ ధర జీవన్ రెడ్డి అన్నారు. మా మీద చార్జిషీట్ కాదు.. బీజేపీ వాళ్లు ఇచ్చిన హామీలపై ప్రాసిక్యూట్ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.
