Cyber scam: జనాలని ఎట్లా మోసం చేయాలని రోజుకో కొత్తదారి వెతుక్కుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. మనుషులని ఎలా బుట్టలో వేసుకోవాలి వారి నుంచి డబ్బులు ఎలా లాగానే దానిమీద పీహెచ్డీలు చేస్తున్నారు. రోజుకో విధంగా ఘరానా మోసం చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. మీరు బారిన పడకుండా ఉండకు ప్రభుత్వాలు పోలీసులు ప్రజలకు ఎంత చెప్పినా గాని ఏదో ఒక విధంగా ఈ మాయగాల్ల మూటలో పడిపోతున్నారు. సైబర్ నేరగాళ్లు జనాన్ని మోసం చేసేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు.
తాజాగా, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్లు తెలిసేసరికి రిటైర్డ్ షిప్ కెప్టెన్ (75) రూ.11.16 కోట్లు పోగొట్టుకున్నారు. ఆయన మొబైల్ నంబరును ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆగస్టు 19న ఓ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. ఓ ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పేరుతో స్కామర్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పారు. బాధితుడు రూ.11.16 కోట్లు అనేక బ్యాంకు ఖాతాలకు పంపించారు. తర్వాత బాధితునికి మోసపోయానని అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

