MAHAA Vamsi Comment: ఒక చోట ఎదో దొంగతనం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ దొంగతనం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి నిజమే. కానీ, అందులో నాపేరు లేదుగా.. అని ఎవరైనా అంటే అటువంటి వాదన చేసేవారిపై జాలిపడగలమే తప్ప ఇంకేమీ చేయలేము. సరిగ్గా ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాగా అదానీ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాల్లో లంచాలు చేతులు మారాయి అని ఎక్కడో అమెరికాలో కేసు నమోదు అయింది. ఆ విషయంలో కొన్నిరోజులుగా అప్పటి ప్రభుత్వ నిర్వాకంపై వార్తలు వెల్లువెత్తుతున్నాయి. జరిగింది ఇదీ.. అని చెప్పాల్సిన మాజీ ముఖ్యమంత్రి.. ఆరోపణలు వచ్చాయి. కానీ, అందులో నా పేరు లేదుగా.. నాకు సంబంధం ఏమిటి? అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ వాపోయారు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
MAHAA Vamsi Comment: విద్యుత్ ఒప్పందాల విషయంలో తప్పు జరిగింది అనేది నిజం. అందులో లంచాలు ఎవరు తీసుకున్నారు.. ఎంత తీసుకున్నారు అనేది పక్కన పెడితే.. ఆ సమయంలో స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి తన పేరు ఆరోపణల్లో వినపడటం లేదుగా అని చెప్పడమే విడ్డూరంగా ఉంది. పైగా నాపేరు లేకుండా.. ఎలా ప్రచారం చేస్తున్నారు అంటూ మీడియాపై ఎదురుదాడి మొదలు పెట్టారు. మీడియాపై కేసులు వేస్తానంటూ కొత్త పల్లవి అందుకున్నారు. నిజమే కేసులు వేసే హక్కు ఆయనకు ఉంది. అందులో సందేహం లేదు. కానీ, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డికు ఉంది కదా.
MAHAA Vamsi Comment: ఆదానీతో ఒప్పందాల విషయంలో మేము అసలు ఆదానీతో ఒప్పందాలు చేసుకోలేదు. SECIతో ఒప్పందం చేసుకున్నాం అంటూ చెబుతున్నారు. SECI అనేది విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థ కాదు. అది అదానీ నుంచి విద్యుత్ తీసుకుని.. సరఫరా కోసం మధ్యవర్తిగా ఉంటుంది. ఒప్పందం ఎవరితో అనేది పక్కనపెడితే ఆరోపణలు వచ్చింది అదానీ మీద.. అదానీ నుంచి ఏపీలో కొందరికి ముడుపులు అందాయనేది అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ ఆరోపణ. దాని గురించి మాట్లాడాలి. ఆ విషయంలో ప్రజలకు సూటిగా అది మానేసి జగన్మోహన్ రెడ్డి ఎప్పటిలానే ఎదురుదాడి మంత్రాన్నే జపిస్తుండడం విషాదం.