Chandrababu Naidu

Chandrababu: నవంబర్ 29 నుంచి ఎంపీలంతా ఢిల్లీలోనే ఉండాలి..!

Chandrababu: ఏపీ రాజకీయాల్లో ఇవాళ ఒకేసారి ఢిల్లీ లెవల్ పాలిటిక్స్ నుంచి, అమరావతి రాజధాని, విశాఖ రుషికొండ ప్యాలెస్ దాకా మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్స్ బయటకు వచ్చాయి! శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో చాలా ఓపెన్‌గా, పక్కా క్లారిటీతో మాట్లాడారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లు ఏపీకి ఒక గోల్డెన్ ఛాన్స్ అని సీఎం తేల్చిచెప్పారు.

ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం సీట్లు విభజిస్తే, జనాభా నియంత్రణ పాటించిన మన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కానీ కేంద్రం ప్రతిపాదించినట్లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను సమానంగా 50 శాతం పెంచితే ఏ రాష్ట్రానికీ నష్టం ఉండదు, ఏపీకి కూడా మంచి అవకాశాలు వస్తాయి” అని చంద్రబాబు మంత్రులకు వివరించారు.

ఈ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల కోసం నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా ఫోన్ చేసి ఢిల్లీ రావాలని తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానించారని చంద్రబాబు వెల్లడించారు.

దీంతో ఈ నెల 29 నుంచే టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలందరూ తప్పనిసరిగా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సీఎం స్ట్రిక్ట్‌గా ఆదేశించారు. అంతకంటే ముందు రేపు (శనివారం) రాజమహేంద్రవరంలో జరగనున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కార్యక్రమానికి తాను హాజరవుతున్నానని, ప్రభుత్వం తరఫున జడ్జీలకు ఏర్పాటు చేసే విందుకు పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానించానని చంద్రబాబు తెలిపారు.

ఇక రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “అమరావతిపై కొందరు అదే పనిగా విషప్రచారం చేస్తూ, ప్రపంచబ్యాంకు, ఏడీబీ (ADB) వంటి సంస్థలకు ఫిర్యాదులు పంపి రాజధాని పనులను అడ్డుకోవాలని చూస్తున్నారు. 29 వేల మంది రైతులు తమ భూములిచ్చి చేసిన త్యాగాలను కూడా హేళన చేస్తున్నారు” అని మండిపడ్డారు.

ఈ క్రమంలో అమరావతి కోసం రైతులు చేసిన పోరాటానికి, త్యాగాలకు గుర్తుగా ఒక గొప్ప స్మారక నిర్మాణం (Monument) చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ సూచించగా, సీఎం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే రైతులకు మరింత లాభం చేకూర్చేలా డిసెంబర్ 1న హార్టికల్చర్ హబ్‌ను ప్రారంభించబోతున్నామని, దీని అమలు కోసం ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేసి ఒక సీఈవోను కూడా నియమిస్తామని వెల్లడించారు.

మరోవైపు, విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ విషయంలో పవన్ కల్యాణ్ ఇచ్చిన సూచనకు కేబినెట్‌లో ఫుల్ సపోర్ట్ లభించింది. కేబినెట్ సబ్ కమిటీ సూచించినట్లు ప్యాలెస్‌ను పర్యాటక రంగానికి (PPP మోడల్) అప్పగించే లోపు.. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని ఎలా దుబారా చేసిందో సామాన్య ప్రజల కళ్లకు కట్టినట్లు తెలియాలంటే, ప్యాలెస్‌ను ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచాలని పవన్ కల్యాణ్ సూచించారు. దీనిపై తక్షణమే ఏర్పాట్లు చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

చివరగా, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై సీఎం ఫోకస్ పెట్టారు. ఇటీవల కుదుర్చుకున్న రూ.36 వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, గ్రౌండ్ లెవల్‌లో ఫ్యాక్టరీల నిర్మాణం, ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ప్రతి ప్రాజెక్టుకు ఒక స్పష్టమైన క్యాలెండర్ ఉండాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు పూర్తి భరోసా కల్పించే ‘పెట్టుబడుల రక్షణ చట్టం’ ను వచ్చే జనవరి నాటికి ఆమోదించి, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. మొత్తానికి ఢిల్లీ రాజకీయాల నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు కూటమి ప్రభుత్వం ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *