AP SSC Exams Fee: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 2027లో జరగనున్న పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ మరియు ఒకసారి ఫెయిల్ అయిన (Once-failed) విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ కీలక అప్‌డేట్ ఇచ్చింది. పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ను డైరెక్టర్ కె.వి. శ్రీనివాసులు రెడ్డి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం, విద్యార్థులు నేటి నుంచి (నవంబర్ 26, 2026) డిసెంబర్ 5, 2026 వరకు ఎలాంటి ఆలస్య రుసుము (Late Fee) లేకుండా తమ పరీక్ష ఫీజును చెల్లించుకోవచ్చు.
ఒకవేళ ఈ గడువులోగా ఫీజు చెల్లించలేకపోయిన అభ్యర్థులకు ఆలస్య రుసుముతో మూడు దశల్లో అవకాశం కల్పించారు. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 9 వరకు రూ.50 ఆలస్య రుసుముతో, డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 13 వరకు రూ.200 ఆలస్య రుసుముతో, మరియు డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 18, 2026 వరకు రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు ఇచ్చారు. నిర్దేశించిన ఈ గడువులను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పొడిగించబోమని డైరెక్టరేట్ స్పష్టం చేసింది.
ఫీజు వివరాల విషయానికొస్తే.. అన్ని సబ్జెక్టులు లేదా మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజరయ్యే రెగ్యులర్ అభ్యర్థులకు పరీక్ష ఫీజును రూ.125గా నిర్ణయించారు. మూడు సబ్జెక్టుల వరకు మాత్రమే రాసే అభ్యర్థులు రూ.110 చెల్లించాలి. వొకేషనల్ అభ్యర్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉండగా, నిర్ణీత వయసు నిబంధనలకు మినహాయింపు కోరే విద్యార్థులు వయోపరిమితి సడలింపు రుసుముగా రూ.300 కట్టాలి.
ఫీజు చెల్లింపు ప్రక్రియపై ప్రధానోపాధ్యాయులకు (Headmasters) డైరెక్టర్ కె.వి. శ్రీనివాసులు రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముందుగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను వారి వారి UDISE+ పాఠశాల లాగిన్‌ల ద్వారా అప్‌డేట్ చేసి ధృవీకరించుకోవాలని సూచించారు.
ఆ తర్వాత అధికారిక వెబ్‌సైట్ [https://bse.ap.gov.in](https://bse.ap.gov.in) లోని పాఠశాల లాగిన్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లించాలి. సీఎఫ్ఎంఎస్ (CFMS) లేదా బ్యాంక్ చలాన్‌ల ద్వారా చేసే చెల్లింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, అలాగే ఏ స్థాయిలోనూ మాన్యువల్ నామినల్ రోల్స్ (MNRs) సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా విద్యార్థుల ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
