Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రచించిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) మరోసారి రాజకీయ, న్యాయ వివాదంలో చిక్కుకుంది. ఈ పుస్తకంలో స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ (వీర్ సావర్కర్) జీవితాన్ని, సిద్ధాంతాలను వక్రీకరించే విధంగా రాశారని ఆరోపిస్తూ ఆయన మునిమనవడు సత్యకి సావర్కర్ సోనియా గాంధీకి లీగల్ నోటీసు పంపించారు. సత్యకి సావర్కర్ తరపున న్యాయవాది సంగ్రామ్ కొల్హట్కర్ ఈ నోటీసును జారీ చేశారు.
15 రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం..
-
డిమాండ్లు: పుస్తకంలోని 201, 443 పేజీలలో ఉన్న వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధంగా, చారిత్రకంగా తప్పుదోవ పట్టించేలా, సావర్కర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. నోటీసు అందిన 15 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు ఆ తప్పులను సవరించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
-
కోర్టు చర్యల హెచ్చరిక: గడువులోగా స్పందించకపోతే తగిన న్యాయస్థానంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పుస్తకంలోని ఏ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమైంది?
| పుస్తకం పేజీ నంబర్ | సోనియా గాంధీ రాసిన అంశం | సావర్కర్ కుటుంబం అభ్యంతరం & వాదన |
| పేజీ నంబర్ 201 | “కాంగ్రెస్ స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ పాలకుల దాడులు, జైలు శిక్షలు ఎదుర్కొంటున్న సమయంలో.. ఆర్ఎస్ఎస్ సీనియర్ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ బ్రిటిష్ వారికి క్షమాభిక్ష పిటిషన్లు రాశారు, ఆ సంస్థ సభ్యులు బ్రిటిష్ అధికారులకు ఇన్ఫార్మర్లుగా పనిచేశారు.” | అండమాన్ సెల్యులార్ జైలులో సావర్కర్ అనుభవించిన కఠిన కారాగార శిక్షను, ఆనాటి చారిత్రక నేపథ్యాన్ని విస్మరించి.. ఆయన స్వాతంత్ర్య సమరయోధులపై ఇన్ఫార్మర్గా వ్యవహరించారనే తప్పుడు అభిప్రాయం కలిగించేలా రాయడం దారుణం. |
| పేజీ నంబర్ 443 | “గాంధీజీ సమకాలికుడు, హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ భారతదేశాన్ని హిందువుల ఆధిపత్యం ఉండే దేశంగా చూడాలనే భావజాలాన్ని ప్రతిపాదించారు. ఆ ఆలోచననే ఆర్ఎస్ఎస్, బీజేపీ, సంఘ్ పరివార్ అనుసరిస్తున్నాయి.” | సావర్కర్ రాజకీయ, సైద్ధాంతిక తత్వాన్ని పూర్తిగా వక్రీకరించి, తప్పుగా చిత్రీకరించారని నోటీసులో పేర్కొన్నారు. |
ఇప్పటికే శివసేన ఆందోళనలు..
