ముఖ్యంగా భవిష్యత్ టెక్నాలజీలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హైపర్ స్కేల్ డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్ రంగాల్లో భారీగా పెట్టుబడులు రావడం వల్ల రాష్ట్ర యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి!డేటా సెంటర్లు, ఏఐ & గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులు:రెండో రోజు కుదిరిన ఒప్పందాల్లో టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాలు అగ్రస్థానంలో నిలిచాయి.
పంచశీల్ రియాల్టీ: హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం అత్యధికంగా రూ. 37,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది.
ఏఎం ఏఐ ఫ్యాక్టరీ (AM AI Factory): రూ. 31,387 కోట్ల భారీ పెట్టుబడితో ఏఐ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు 1,000 ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందం చేసుకుంది.
ఇంధన రంగం: వారీ ఎనర్జీస్ (Waaree Energies) రూ. 10,000 కోట్లు (1,000 ఉద్యోగాలు), క్లీన్‌మాక్స్ ఎన్విరో ఎనర్జీ రూ. 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.
స్మాక్స్ డిజిటెక్ (Smax Digitech): రెండు వేర్వేరు ప్రాజెక్టుల కింద రూ. 4,270 కోట్లు, అలాగే క్లబ్స్ & ఎరినా కోసం మరో రూ. 1,500 కోట్ల పెట్టుబడికి అంగీకరించింది.
ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, తయారీ రంగాల్లో వేలల్లో ఉద్యోగాలు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే తయారీ, రక్షణ రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగాయి.
ఏఐఎల్ డిక్సాన్ టెక్నాలజీస్: ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో రూ. 450 కోట్ల పెట్టుబడితో ఏకంగా 7,000 మందికి ఉపాధి కల్పించనుంది.
సబ్ స్టేట్ మాన్యుఫాక్చరింగ్: రూ. 931 కోట్ల పెట్టుబడితో 4,000 ఉద్యోగాలు సృష్టించనుంది.
కెయిన్స్ టెక్నాలజీ: రూ. 3,145 కోట్ల పెట్టుబడితో 2,000 ఉద్యోగాలు, సాల్వో ఇండస్ట్రీస్ రూ. 800 కోట్లతో 2,000 ఉద్యోగాలు, ఆర్చియన్ గ్రూప్ రూ. 2,000 కోట్లతో 1,200 ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చాయి.
ఏరోస్పేస్ & డిఫెన్స్: సైయింట్ డీఎల్‌ఎం – హిందుస్థాన్ షిప్ యార్డ్ కలిసి రూ. 1,000 కోట్లు, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ రూ. 550 కోట్లు (565 ఉద్యోగాలు), ఐజీ డిఫెన్స్ రూ. 500 కోట్ల (1,000 ఉద్యోగాలు) పెట్టుబడులకు సంతకాలు చేశాయి.
హాస్పిటల్స్, మౌలిక వసతుల విస్తరణ..
వైద్య రంగం: కిమ్స్ (KIMS) హాస్పిటల్స్ రూ. 1,500 కోట్లు (2,000 ఉద్యోగాలు), యోధ హెల్త్ కేర్ రూ. 1,359 కోట్లు, పీవీఎస్ రామ్మోహన్ హెల్త్ కేర్ రూ. 312 కోట్ల (1,500 ఉద్యోగాలు) పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
వీటితో పాటు ఈపాక్ డేటా సెంటర్ (రూ. 570 కోట్లు), ఇన్ఫినిటీ (రూ. 250 కోట్లు – 1,100 ఉద్యోగాలు), సముద్ర సూర్య (రూ. 100 కోట్లు), ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ (రూ. 10 కోట్లు – 1,000 ఉద్యోగాలు) రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించనున్నాయి.
నైపుణ్యాభివృద్ధి, అమరావతి ప్లానింగ్‌పై స్పెషల్ డీల్స్..కేవలం ఆర్థిక పెట్టుబడులే కాకుండా, భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వం మూడు కీలక ఒప్పందాలు చేసుకుంది..
- యువతకు వర్క్ ఫోర్స్ ట్రైనింగ్ ఇచ్చేందుకు హొరిబా ఇండియా సంస్థతో ఒప్పందం.
- రాజధాని అమరావతిలో పర్యావరణ అనుకూల పట్టణ ప్రణాళిక (Climate Response Urban Planning) కోసం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (UNEP) తో భాగస్వామ్యం.
- రాష్ట్రవ్యాప్తంగా హెలీ పోర్ట్స్ (Heliports) అభివృద్ధి కోసం పవన్ హాన్స్ (Pawan Hans) సంస్థతో కీలక ఒప్పందం కుదిరింది.
