IPS Transfers: తెలంగాణ పోలీస్ శాఖలో ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల బలోపేతంలో భాగంగా ఒకేసారి 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో అత్యంత కీలకమైన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) సహా ఏసీబీ, ఆర్టీసీ, ఫైర్ సర్వీసెస్, శాంతిభద్రతల విభాగాలకు కొత్త బాస్‌లను నియమించారు.
హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీగా సమర్థవంతంగా పనిచేసిన వీసీ సజ్జనార్‌ను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేయగా, ఆయన స్థానంలో టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ఎండీగా అనిల్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా చారు సిన్హా, ఏసీబీ డైరెక్టర్‌గా ఎస్. చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల విభాగమైన అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) బాధ్యతలను ఆకున్ సబర్వాల్‌కు అప్పగించగా, మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగం డీజీపీగా సౌమ్య మిశ్రా బదిలీ అయ్యారు. జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా, పౌర సరఫరాల శాఖ (సివిల్ సప్లైస్) కమిషనర్‌గా నాగిరెడ్డి, గ్రేహౌండ్స్ & ఆక్టోపస్ డీజీపీగా విక్రమ్ సింగ్ మాన్, తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ (TG-TMARS) డైరెక్టర్‌గా ఎం. స్టీఫెన్ రవీంద్రలను ప్రభుత్వం నియమించింది.
తెలంగాణ ఐపీఎస్ అధికారుల బదిలీలు – కీలక పోస్టింగ్‌ల వివరాలు..
-
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ): మహేష్ భగవత్
-
ఫైర్ & డిజాస్టర్ రెస్పాన్స్ డీజీ: వీసీ సజ్జనార్
-
టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ఎండీ: అనిల్ కుమార్
-
ఏసీబీ (ACB) డీజీ: చారు సిన్హా
-
ఏసీబీ డైరెక్టర్: ఎస్. చంద్రశేఖర్ రెడ్డి
-
అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్): ఆకున్ సబర్వాల్
-
మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా డీజీపీ: సౌమ్య మిశ్రా
-
జైళ్ల శాఖ డీజీ: స్వాతి లక్రా
-
గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీపీ: విక్రమ్ సింగ్ మాన్
-
పౌర సరఫరాల (సివిల్ సప్లైస్) కమిషనర్: నాగిరెడ్డి
-
TG-TMARS (ట్రాఫిక్ మేనేజ్‌మెంట్) డైరెక్టర్: ఎం. స్టీఫెన్ రవీంద్ర
