SEC: సాధారణంగా ఉద్యోగంలో ఉన్నప్పుడు పాలిటిక్స్‌కి దూరంగా ఉండటం చూస్తూనే ఉంటాం. కానీ, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రిటైర్డ్ బాబులకు కూడా దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. సర్వీస్‌లో ఉన్నవాళ్లకే కాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసి రిటైర్ అయిన మాజీ అధికారులకు కూడా ఎలక్షన్ కోడ్ (Model Code of Conduct) పక్కాగా వర్తిస్తుందని ఈసీ కుండబద్దలు కొట్టింది. “రిటైర్మెంట్ వచ్చింది కదా అని నచ్చిన పార్టీ జెండా కట్టేసి ప్రచారంలోకి దిగుతాం.. తెరవెనుక ఉండి పాలిటిక్స్ నడిపిస్తాం.. పార్టీలకు అనుకూలంగా పావులు కదుపుతాం” అంటే అస్సలు కుదరదు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలాగైతే న్యూట్రల్‌గా ఉండాలో, రిటైర్ అయ్యాక కూడా అదే రూల్ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే.. చాలామంది మాజీ బ్యూరోక్రాట్లు రిటైర్ అవ్వగానే తమ పాత పలుకుబడి, నెట్‌వర్క్‌ను వాడుకుని క్షేత్రస్థాయిలో ఉన్న ప్రస్తుత ఉద్యోగులను ప్రభావితం చేయడం, పార్టీల ఎన్నికల వ్యూహాల్లో చక్రం తిప్పడం లాంటివి చేస్తుంటారు. ఇది ఎన్నికల స్వచ్ఛతను దెబ్బతీస్తుందనేది ఈసీ ఆలోచన. అందుకే ప్రచార వేదికలు ఎక్కడం గానీ, పార్టీల తరఫున ప్రెస్మీట్లు పెట్టి ప్రత్యర్థులపై విమర్శలు చేయడం గానీ చేయకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. నిబంధనలు కాదని ఎవరైనా హద్దులు దాటితే.. పెన్షన్ బెనిఫిట్స్, ఇతర ప్రభుత్వ సదుపాయాల్లో కోత పెట్టడం సహా తీవ్రమైన లీగల్ యాక్షన్ తీసుకుంటామని చీఫ్ ఎలక్షన్ కమిషన్ హెచ్చరించింది. సింపుల్‌గా చెప్పాలంటే, పెన్షన్ తీసుకుంటున్నంత కాలం ప్రభుత్వ వ్యవస్థతో ముడిపడి ఉన్నట్టే.. కాబట్టి పాలిటిక్స్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
