Samantha: సోషల్ మీడియాలో ఈ మధ్య ఏఐ (AI) మాయ ఏ రేంజ్‌లో నడుస్తోందో మనందరికీ తెలిసిందే! అసలు ఏది రియల్, ఏది ఫేక్ అనేది అర్థం కాక జనాలు తలలు పట్టుకుంటున్నారు. ఇక టెక్నాలజీతో అంతగా టచ్ లేని మన ఇంట్లోని పెద్దవాళ్లయితే.. ఫోన్లలో కనిపించే ప్రతిదాన్నీ గుడ్డిగా నమ్మేసి ఏకంగా ఇంట్లో వాళ్లతోనే వాదనలకు దిగేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సీనే ఒక బామ్మ విషయంలో జరిగింది. టాలీవుడ్ స్టార్ సమంతకు డెలివరీ అయిపోయిందని, కవల పిల్లలు పుట్టారని ఆ బామ్మ చేసిన వాదనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ నవ్వులు పూయిస్తోంది. దీనిపై సామ్ ఇచ్చిన రిప్లై అయితే ఇంకా క్రేజీగా ఉంది!
బెడ్ మీదే మెటర్నిటీ ఫొటోషూట్.. సామ్ స్పెషల్ వైబ్స్..
సమంత ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ ఫేజ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా, ఇన్‌స్టాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా హెల్త్, ఫిట్‌నెస్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఆమె చేసే వర్కౌట్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
అయితే, ఇటీవల ఒక చిల్ మూడ్‌లో బెడ్‌పై పడుకుని బేబీ బంప్‌ను చూపిస్తూ.. “నా మెటర్నిటీ ఫొటోషూట్ ఇదే అనుకోండి” అంటూ చాలా సింపుల్‌గా ఒక పోస్ట్ పెట్టింది. ఆ పిక్చర్ నెట్టింట క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఈ పోస్ట్ చూసిన కొందరు ఆకతాయిలు ఊరుకుంటారా? వెంటనే ఏఐ టెక్నాలజీని వాడి.. సమంతకు ఇద్దరు కవల పిల్లలు పుట్టేశారని, ఆ పిల్లలను ఆమె ఎత్తుకున్నట్లు కొన్ని మార్ఫింగ్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వదిలారు. అవి చూడటానికి ఎంత నేచురల్‌గా ఉన్నాయంటే, నెట్ గురించి పెద్దగా ఐడియా లేనివాళ్లు ఈజీగా నమ్మేస్తారు.
మనవడితో బామ్మ వాదన.. “నాకు ఫోన్లో కనిపించిందిరా!”
ఈ ఫేక్ వీడియో కాస్తా ఒక బామ్మ కంటపడింది. అంతే.. ఆమె దాన్ని నూటికి నూరుపాళ్లు నిజమని నమ్మేసింది. సమంతకి డెలివరీ అయిపోయింది.. ఇద్దరు కవలలు పుట్టారు.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్లిపోయింది అంటూ తన మనవడితో గట్టిగా వాదించడం మొదలుపెట్టింది. మనవడు ఎంత చెప్పినా ఆమె వినలేదు.. అది అబద్ధం బామ్మా.. ఎవరో కంప్యూటర్‌లో క్రియేట్ చేశారు అని వాడు మొత్తుకుంటున్నా, “లేదూ.. నాకు ఫోన్లో క్లియర్‌గా కనిపించింది, నాకే చెప్తున్నావా?” అంటూ తన వాదనే కరెక్ట్ అని పట్టుబట్టింది. ఈ సరదా సంభాషణను ఆ మనవడు రీల్ తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అది విపరీతంగా ట్రెండ్ అయిపోయింది.
“ఇంకా లేదు అమ్మమ్మ”.. సామ్ క్యూట్ క్లారిటీ!
ఈ వైరల్ వీడియో చివరకు సమంత వరకు చేరింది. ఆ బామ్మ అమాయకత్వాన్ని చూసి మురిసిపోయిన సామ్.. అస్సలు సీరియస్ అవ్వకుండా ఫుల్లుగా నవ్వుకుంది.
వెంటనే ఆ వీడియోపై స్పందిస్తూ.. “ఇంకా లేదు అమ్మమ్మ..” (No, not yet Dadi) అంటూ లవ్, లాఫింగ్ ఎమోజీలతో చాలా స్వీట్‌గా క్లారిటీ ఇచ్చింది. పెద్దవాళ్ల అమాయకత్వంపై సమంత అంత సరదాగా, గౌరవంగా స్పందించడం చూసి నెటిజన్లు “సామ్ ఎంత డౌన్ టు ఎర్త్!” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
