Green Goblin: హాలీవుడ్ సూపర్ హీరో సినిమా ‘స్పైడర్-మ్యాన్’లో ప్రతినాయకుడు ‘గ్రీన్ గోబ్లిన్’ గాల్లో గ్లైడర్‌పై నిలబడి దూసుకుపోతుంటే కేవలం సైన్స్ ఫిక్షన్ లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్ అనుకున్నాం. కానీ ఆ విజువల్ వండర్‌ను నిజ జీవితంలో సాకారం చేసి చూపించాడు చైనాకు చెందిన 26 ఏళ్ల టెక్ ఇన్ఫ్లుయెన్సర్ సాంగ్ జింగ్యు (Song Xingyu). స్వయంగా తానే రూపొందించిన ఎలక్ట్రిక్ హోవర్‌బోర్డ్‌పై నిలబడి పర్వతాలు, నగర వీధులు, సువిశాల యాంగ్జీ నది మీదుగా గాల్లో చక్కర్లు కొట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
టింబర్ డిపో నుంచి ఫ్లయింగ్ డివైస్ వరకు..
10 బ్రష్‌లెస్ మోటార్లు: ప్రస్తుతం విజయవంతమైన మోడల్లో 10 శక్తిమంతమైన బ్రష్‌లెస్ ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చాడు. ఇది నలుగురు పెద్దల బరువును కూడా మోసేంత సామర్థ్యాన్ని కలిగి ఉంది.
బాడీ మూవ్మెంట్స్ & AI నియంత్రణ: ఈ ఫ్లయింగ్ బోర్డును నడిపే వ్యక్తి తన శరీర కదలికలతోనే (Body movements) చాలావరకు నియంత్రించవచ్చు. బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండేందుకు బోర్డుపై, చేతి మణికట్టుపై ఏఐ-ఎనేబుల్డ్ స్మార్ట్ఫోన్లను అమర్చి, రియల్ టైమ్ ఆడియో గైడెన్స్ ద్వారా స్థిరత్వాన్ని సాధించాడు.
యాంగ్జీ నదిపై అద్భుత ప్రయాణం.. వీడియో వైరల్!
Flying like a swordsman! Who hasn’t dreamed of this? Song Xingyu from Badong, Hubei, built his own electric manned flying skateboard.
#FlyingSkateboard #ChinaInnovation https://t.co/sBY7MBS7lq— Guan Gong (@sxrbggpp) October 26, 2026
