Schedule Of Polling

Schedule Of Polling: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రీషెడ్యూల్.. కొత్త తేదీలను ప్రకటించిన ఎస్‌ఈసీ!

Schedule Of Polling: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC) రీషెడ్యూల్ చేసింది. మునుపటి షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉండగా, అదే రోజున పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండటంతో అధికారులు ఈ మార్పులు చేశారు. సుప్రీంకోర్టు నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఎస్‌ఈసీ ఈ సవరించిన తేదీలను అధికారికంగా ప్రకటించింది.

కొత్త షెడ్యూల్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9,828 ఎంపీటీసీ, 650 జెడ్పీటీసీ స్థానాలకు నవంబర్ 5న పోలింగ్ నిర్వహించనున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగి రీపోలింగ్ అవసరమైతే నవంబర్ 6న నిర్వహించేలా ప్లాన్ చేశారు. అనంతరం నవంబర్ 7న ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. అక్టోబర్ 28న జరగాల్సిన మున్సిపల్ పోలింగ్ నవంబర్ 1కి, కౌంటింగ్ నవంబర్ 3కి వాయిదా పడిన నేపథ్యంలోనే గ్రామీణ స్థానిక సంస్థల షెడ్యూల్‌ను రెండు రోజులు ముందుకు జరిపినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *