Janasena: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన పార్టీ కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరిశీలించి ఆమోదించిన ఈ లిస్టులో పలువురు సీనియర్ నాయకులకు, మహిళలకు సమ ప్రాధాన్యం దక్కింది. ముఖ్యంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బరిలో ఇటీవల పార్టీలో చేరిన ప్రముఖ నేత వంగవీటి రాధాకృష్ణ పేరును ఖరారు చేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఏలూరు కార్పొరేషన్ స్థానానికి రెడ్డి అప్పలనాయుడు అభ్యర్థిత్వాన్ని పార్టీ నాయకత్వం ఖరారు చేసింది.
కార్పొరేషన్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కూడా అభ్యర్థుల పేర్లను జనసేన ఖరారు చేసింది. అమలాపురం నుంచి నల్లా శ్రీధర్, పిఠాపురం నుంచి డాక్టర్ బీరా విజయ్ శేఖర్, తెనాలి నుంచి తోటకూర వెంకట రమణారావు బరిలో నిలవనున్నారు. చిలకలూరిపేట, నరసాపురం, నిడదవోలు, పెడన, సాలూరు, తిరువూరు స్థానాల్లో మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించారు. తొలి జాబితా విడుదల కావడంతో ఆయా నియోజకవర్గాల్లో జనసేన శ్రేణులు ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నాయి.
అభ్యర్థుల పూర్తి వివరాలు..
-
కార్పొరేషన్లు:
-
ఏలూరు: శ్రీ రెడ్డి అప్పలనాయుడు
-
విజయవాడ: శ్రీ వంగవీటి రాధాకృష్ణ
-
-
మున్సిపాలిటీలు / నగర పంచాయతీలు:
-
అమలాపురం: శ్రీ నల్లా శ్రీధర్
-
చిలకలూరిపేట: శ్రీమతి తోట రాజరాజేశ్వరి
-
గొల్లప్రోలు: శ్రీ కడారి తమ్మయ్య నాయుడు
-
నరసాపురం: శ్రీమతి కొత్తపల్లి శైలజ
-
నిడదవోలు: శ్రీమతి కల్లం జ్యోతి
-
పెడన: శ్రీమతి మట్టా శివపావని
-
పిఠాపురం: డాక్టర్ బీరా విజయ్ శేఖర్
-
పుత్తూరు: శ్రీ డి. ఏలుమలై
-
సాలూరు: శ్రీమతి గొర్లె విజయకుమారి
-
సామర్లకోట: శ్రీ పిట్టా జానకి రామారావు
-
తెనాలి: శ్రీ తోటకూర వెంకట రమణారావు
-
తిరువూరు: శ్రీమతి పి. మాధవి
-
జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా
మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆమోదం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కార్పొరేషన్లు
1.ఏలూరు: శ్రీ రెడ్డి అప్పలనాయుడు
2.విజయవాడ: శ్రీ వంగవీటి రాధాకృష్ణ
మున్సిపాలిటీలు
1. అమలాపురం: శ్రీ నల్లా శ్రీధర్
2. చిలకలూరిపేట: శ్రీమతి తోట రాజరాజేశ్వరి
3. గొల్లప్రోలు: శ్రీ కడారి తమ్మయ్య నాయుడు
4. నరసాపురం: శ్రీమతి కొత్తపల్లి శైలజ
5.నిడదవోలు: శ్రీమతి కల్లం జ్యోతి
6.పెడన: శ్రీమతి మట్టా శివపావని
7.పిఠాపురం: డాక్టర్ బీరా విజయ్ శేఖర్
8.పుత్తూరు: శ్రీ డి. ఏలుమలై
9.సాలూరు: శ్రీమతి గొర్లె విజయకుమారి
10.సామర్లకోట: శ్రీ పిట్టా జానకి రామారావు
11.తెనాలి: శ్రీ తోటకూర వెంకట రమణారావు
12.తిరువూరు: శ్రీమతి పి. మాధవి— JanaSena Party (@JanaSenaParty) October 17, 2026
