Salman Khan

Salman Khan: బెడ్‌రూమ్ మ్యాటర్స్ అక్కడే ఉండాలి.. బయటికి రావొద్దు..!

Salman Khan: బాలీవుడ్ ‘భాయ్‌జాన్’ సల్మాన్ ఖాన్ స్క్రీన్‌పై కనిపించినా, రియల్ లైఫ్‌లో మాట్లాడినా ఆ వైబే వేరు. 30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీని ఏలుతున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పర్సనల్ లైఫ్, పెళ్లి, లవ్ ఎఫైర్స్ గురించి ఎప్పుడూ దేశవ్యాప్తంగా ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం బుల్లితెరపై మోస్ట్ సక్సెస్ ఫుల్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 20’ని హోస్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సల్లూ భాయ్.. తాజాగా కరణ్ జోహార్ పాపులర్ సెలబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 9’ (Koffee With Karan Season 9) లో సందడి చేశారు.

ఈ ఎపిసోడ్‌లో సల్మాన్‌తో పాటు ఆయన చిరకాల స్నేహితురాలు, సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్ కూడా జాయిన్ అయ్యారు. చిల్ మోడ్‌లో సాగిన ఈ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తన బయోపిక్, రిలేషన్స్, తండ్రి కావడం, సలీమ్ ఖాన్ ఇచ్చిన క్రేజీ అడ్వైజ్‌ల గురించి ఓపెన్‌గా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
నా బయోపిక్ ఎవరూ తీయలేరు.. నాతోనే అది సమాధి కావాలి..!
రాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా కరిష్మా కపూర్.. “ఒకవేళ మీ లైఫ్ స్టోరీని సినిమాగా తీస్తే సూరజ్ బర్జాత్యా, కబీర్ ఖాన్, డేవిడ్ ధావన్, సంజయ్ లీలా భన్సాలీలలో ఏ డైరెక్టర్‌ను ఎంచుకుంటారు? అని సల్మాన్‌ను అడిగారు. దీనికి సల్మాన్ తనదైన శైలిలో ఫన్నీగా, ప్రాక్టికల్‌గా ఇచ్చిన ఆన్సర్ వైరల్ అవుతోంది.
  • కామెడీ తీస్తే డేవిడ్ ధావన్: నా లైఫ్‌లోని ఫన్నీ, క్రేజీ మూమెంట్స్‌తో ప్యూర్ కామెడీ తీయాలంటే కచ్చితంగా డేవిడ్ ధావన్ బెస్ట్.
  • ట్రాజిక్ లవ్ స్టోరీకి భన్సాలీ: ఒక సాంప్రదాయమైన, విషాదభరితమైన లవ్ స్టోరీగా చూపించాలనుకుంటే సంజయ్ లీలా భన్సాలీ సెట్ అవుతారు.
  • ప్రేమకథల పరంపర అయితే సూరజ్ బర్జాత్యా: నా జీవితంలో ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిన అందమైన ప్రేమకథలన్నింటినీ క్యూట్‌గా తీయాలంటే సూరజ్ బర్జాత్యా కరెక్ట్.
  • యాక్షన్ లవ్ స్టోరీకి కబీర్ ఖాన్: యాక్షన్, ఎమోషన్ కలగలిసిన లవ్ స్టోరీ కావాలంటే కబీర్ ఖాన్ హ్యాండిల్ చేయగలరు.
అయితే, చివర్లో ఈ డిస్కషన్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ సల్మాన్ ఒక బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.. కానీ నా జీవితంపై ఎలాంటి బయోపిక్ రాదు.. ఎవరూ తీయలేరు కూడా. నా జీవిత కథ నాతో పాటే నా సమాధిలోకి వెళ్లిపోతుంది (My life will go to my grave)” అని కుండబద్దలు కొట్టారు. తన సీక్రెట్స్, పర్సనల్ లైఫ్‌ను తెరపై ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చడం తనకు అస్సలు ఇష్టం లేదని తేల్చేశారు.
‘వర్జిన్’ కామెంట్ వెనుక సీక్రెట్ ఏంటి? – నాన్న సలీమ్ ఖాన్ టిప్..
గతంలో ఇదే షోలో ‘నేను వర్జిన్‌ని’ అని చెప్పి ఇంటర్నెట్‌ను షేక్ చేసిన విషయాన్ని కరణ్ జోహార్ మళ్లీ గుర్తు చేయగా, సల్మాన్ గట్టిగా నవ్వుతూ అసలు కారణం బయటపెట్టారు.. మనం ఫలానా అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నామని మీడియాలో ప్రచారం జరుగుతుంది. తీరా చూస్తే ఆ అమ్మాయి మన జీవితాంతం మనతో ఉంటుందో లేదో తెలియదు.. చివరకు వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటుంది. అందుకే నా 15-16 ఏళ్ల వయసు నుంచే నా డేటింగ్ లైఫ్ గురించి బయట మాట్లాడకూడదని డిసైడ్ అయ్యాను. నా రిలేషన్స్‌ను ప్రైవేట్‌గా ఉంచడానికే ఆరోజు అలా జోక్ చేశా అని చెప్పారు.
బెడ్‌రూమ్ మ్యాటర్స్ అక్కడే ఉండాలి..
తన తండ్రి, ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్ తనకు ఇచ్చిన ఒక గోల్డెన్ రూల్‌ను సల్మాన్ గుర్తు చేసుకున్నారు: “బెడ్‌రూమ్‌లో జరిగే విషయాలను బెడ్‌రూమ్‌ వరకే పరిమితం చేయాలి తప్ప, డ్రాయింగ్ రూమ్‌లోకి తీసుకువచ్చి అందరి ముందు చర్చించకూడదు” అని నాన్న చెప్పిన మాటే ఇప్పటికీ ఫాలో అవుతున్నానని తెలిపారు.
నేను కూడా పిల్లల్ని కంటాను.. ఎవరినీ నిందించను..
సొంతంగా పిల్లల్ని కనే ఆలోచన ఉందా అని కరణ్ అడిగిన ప్రశ్నకు భాయ్‌జాన్ చాలా ఎమోషనల్ అండ్ మెచ్యూర్డ్‌గా స్పందించారు.
ఎవరూ నాతో ఉండటానికి ఇష్టపడలేదని నేను అనుకోను. కచ్చితంగా ఏదో ఒక సమయంలో నాకు కూడా పిల్లలు పుడతారు.. నన్ను ఎవరూ ఆపలేదు కూడా.
నేను ఫలానాది కోరుకున్నాను.. కానీ ఈ ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా మారింది, అందుకే నా లైఫ్‌లో పార్ట్‌నర్ లేకుండా పోయారు అని సింపతీ కోసం ఏడవడం నాకు నచ్చదు. నా లైఫ్‌లో జరిగిన దానికి నేను ఎవరినీ నిందించలేను అని చాలా జెన్యూన్‌గా చెప్పుకొచ్చారు.
బాక్సాఫీస్ వద్ద సల్మాన్ నయా లైనప్..
ఒకవైపు టీవీలో ‘బిగ్ బాస్ 20’ని విజయవంతంగా నడిపిస్తూనే, మరోవైపు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ లైనప్‌తో రాబోతున్నారు.. చిత్రాంగద సింగ్‌తో కలిసి వార్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘మాతృభూమి’ (Maatrubhumi) లో పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. దీనితో పాటు అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ ‘మాన్‌స్టర్’ (Monster) సినిమాతో త్వరలోనే థియేటర్లలో రచ్చ లేపనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *