Dasara Special Trains: బతుకమ్మ, దేవీ నవరాత్రులు, దసరా పండుగల సీజన్ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సికింద్రాబాద్, హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో మొత్తం 34 ప్రత్యేక రైలు సర్వీసులు నడపనున్నట్లు సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. ఈ ప్రత్యేక సర్వీసులు అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 25 వరకు రోజూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రత్యేక రైళ్ల వివరాలు..
-
రైలు నంబర్ 07711 (సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ డైలీ స్పెషల్)..
-
నడిచే రోజులు: అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 25 వరకు ప్రతిరోజూ (మొత్తం 17 సర్వీసులు).
-
సమయాలు: సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12:10 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 2:10 గంటలకు కాజీపేట జంక్షన్ చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది.
-
-
రైలు నంబర్ 07712 (సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ డైలీ స్పెషల్):
-
నడిచే రోజులు: అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 25 వరకు ప్రతిరోజూ (మొత్తం 17 సర్వీసులు).
- సమయాలు: సిర్పూర్ కాగజ్‌నగర్‌లో సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరి, రాత్రి 8:00 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 11:15 గంటలకు హైదరాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది.
-
కోచ్‌ల కేటాయింపు: ఈ రైళ్లలో ఏసీ చైర్ కార్ (AC Chair Car), సెకండ్ సిట్టింగ్ (2S) తరగతి కోచ్‌లు ఉంటాయి.
హాల్టింగ్ స్టేషన్లు (ఆగే ప్రాంతాలు)..
హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు అనుకూలంగా కీలక పట్టణాల్లో స్టాప్‌లు కేటాయించారు..
-
చర్లపల్లి
-
భువనగిరి
-
జనగాం
-
కాజీపేట జంక్షన్
-
జమ్మికుంట
-
పెద్దపల్లి
-
రామగుండం
-
మంచిర్యాల
-
బెల్లంపల్లి
-
ఆసిఫాబాద్ రోడ్
కాజీపేట మీదుగా హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ)కి వన్‌వే ప్రత్యేక రైళ్లు..
-
రైలు నంబర్ 07031 (హైదరాబాద్ – హజ్రత్ నిజాముద్దీన్ వన్‌వే స్పెషల్):అక్టోబర్ 9న రాత్రి 11:25 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు (అక్టోబర్ 10) తెల్లవారుజామున 1:30 గంటలకు కాజీపేటకు చేరుకుని నిజాముద్దీన్ వైపు వెళ్తుంది.
-
రైలు నంబర్ 07035 (చర్లపల్లి – హజ్రత్ నిజాముద్దీన్ వన్‌వే స్పెషల్):అక్టోబర్ 11న రాత్రి 11:55 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 2:00 గంటలకు కాజీపేటకు చేరుకుని ప్రయాణం కొనసాగిస్తుంది.
-
హాల్టింగ్స్: సికింద్రాబాద్, కాజీపేట, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, కాట్నీ, సత్నా, చిత్రకూట్, బాందా, వీజీఎల్ ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.
