Comrade Kalyan: టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో హీరో శ్రీవిష్ణుది ప్రత్యేకమైన శైలి. ఆయన హీరోగా, మహిమా నంబియార్ హీరోయిన్‌గా జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. స్టార్ రైటర్ కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించిన ఈ సినిమాని రాబోయే శుక్రవారం, అంటే అక్టోబర్ 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మంగళవారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. టీజర్, సాంగ్స్‌తో ఇప్పటికే ఏర్పడిన పాజిటివ్ బజ్‌ను ఈ ట్రైలర్ మరింత పెంచేసింది.
ఆద్యంతం నవ్వుల జాతర – ట్రైలర్ హైలైట్స్..
కళ్యాణ్ (శ్రీవిష్ణు) తల్లిగా సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కనిపించారు. ట్రైలర్‌లో ఆమె నందమూరి బాలకృష్ణకు వీరాభిమానిగా, షార్ట్ టెంపర్ ఉన్న మదర్‌గా తనదైన శైలిలో నవ్వులు పూయించారు. ఇక ఒడిశా అమ్మాయిగా అందాల కథానాయిక మహిమా నంబియార్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. ఆమెతో హీరో ప్రేమకథ వినోదాత్మకంగా సాగింది.
మోస్ట్ వాంటెడ్ నక్సలైట్‌గా కళ్యాణ్ – ట్విస్ట్ ఏంటంటే?..
సరదాగా సాగిపోయే కళ్యాణ్ జీవితంలోకి ఉన్నట్టుండి పోలీసులు ప్రవేశిస్తారు. మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కళ్యాణ్ కోసం షైన్ టామ్ చాకో పోలీస్ ఆఫీసర్‌గా రంగంలోకి దిగుతాడు. అసలు శ్రీవిష్ణు ఎందుకు నక్సలైట్‌గా మారాడు? పోలీసులు అతడి వెంటే ఎందుకు పడుతున్నారు? అనే కీలకమైన అంశాన్ని పూర్తిస్థాయి హిలేరియస్ డ్రామాగా మలిచారు.
కమెడియన్ల పండగ..
శ్రీవిష్ణు మార్క్ వన్-లైనర్స్, కామెడీ టైమింగ్‌తో పాటు వెన్నెల కిషోర్, సత్య, సుదర్శన్, ఉపేంద్ర లిమాయే, బుల్లిరాజు (రేవంత్) తమదైన పంచ్ డైలాగులతో ట్రైలర్‌ను నవ్వుల పండగలా మార్చేశారు. విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినోదానికి మరింత బలం చేకూర్చింది.
9 మంది స్టార్ డైరెక్టర్లతో స్పెషల్ రిలీజ్..
‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్ రిలీజ్‌కు చిత్రబృందం ప్రత్యేకమైన ప్రమోషన్ ప్లాన్ చేసింది. టాలీవుడ్‌కు చెందిన ఏకంగా 9 మంది ప్రముఖ అగ్ర దర్శకులు సోషల్ మీడియా వేదికగా ఈ ట్రైలర్‌ను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు బూస్ట్ ఇచ్చారు.
ట్రైలర్‌ను రిలీజ్ చేసిన దర్శకుల్లో..
-
రామ్ గోపాల్ వర్మ (RGV)
-
అనిల్ రావిపూడి
-
బాబీ (కేఎస్ రవీంద్ర)
-
గోపీచంద్ మలినేని
-
హరీష్ శంకర్
-
బీవీఎస్ రవి
-
నందిని రెడ్డి
-
రామ్ అబ్బరాజు సహా ప్రముఖ దర్శకులు ఉన్నారు.
ఈ సందర్భంగా కోన వెంకట్ స్పందిస్తూ.. “నా ఆత్మీయులు.. నా బలం.. నా వాళ్లు” అంటూ ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో కనిపిస్తుండటం, విభిన్నమైన బ్యాక్‌డ్రాప్‌లో శ్రీవిష్ణు పూర్తిస్థాయి ఫన్ క్యారెక్టర్‌లో చేస్తుండటంతో.. దసరా పండుగ వేళ అక్టోబర్ 9న థియేటర్లలోకి వస్తున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ బాక్సాఫీస్ వద్ద పక్కా విన్నర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
