Fire Incident: తెలంగాణలోని ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి పెను విషాదం చోటుచేసుకుంది. ప్రాణాలను నిలబెట్టాల్సిన స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ (SNCU) విభాగంలో మృత్యువు అగ్నిరూపంలో విరుచుకుపడింది. ఏసీ యూనిట్‌లో సంభవించిన షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి వార్డు మొత్తం క్షణాల్లోనే దట్టమైన పొగ అలుముకుంది. దింతో ఊపిరాడక నరకయాతనలో ఐదు రోజుల పసికందుతో పాటు మరో ఇద్దరు శిశువులు అక్కడికక్కడే మరణించారు. ప్రాణాలకు తెగించి స్పందించిన తల్లిదండ్రులు, సిబ్బంది కిటికీల అద్దాలు పగలగొట్టి మరో 28 మంది చిన్నారులను ప్రాణాలతో కాపాడటంతో పెను ముప్పు తప్పింది.
రాత్రి 11:50 గంటలకు పేలిన ఏసీ – దట్టమైన పొగతో హాహాకారాలు..
సాహసం చేసి అద్దాలు పగలగొట్టిన తల్లిదండ్రులు, సిబ్బంది..
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి – ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం..
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే మాజీ మంత్రి జోగు రామన్న రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల కుటుంబాలను పరామర్శించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
