MAHAA Vamsi Comment: చీకటి ఒప్పందాలు.. జెట్ స్పీడ్ లో అధికారుల పరుగులు.. అంతకు మించిన వేగంతో అగ్రిమెంట్స్.. సింపుల్ గా చెప్పాలంటే అదానీ ఎనర్జీ వ్యవహారంలో జరిగింది ఇదే. ముందు అదానీ వచ్చి జగన్ ను కలిశారు. ఒక్క నెలరోజుల వ్యవధిలో అదానీ మేనల్లుడు వచ్చి కలిశారు. ఆ వెంటనే అధికారులకు ఆదేశాలు వెళ్లిపోయాయి. జరగాల్సిన పనులు జరిగిపోయాయి. సాధారణంగా ఏదైనా ఒక చిన్న అవసరం పడి సామాన్యుడు ప్రభుత్వం దగ్గరకు వెళితే.. ఆ ఫైలు కింద నుంచి పైకి కదలాలంటే సంవత్సరం కనీసం పడుతుంది. కానీ, ఇదంతా పెద్ద వ్యవహారం. సామాన్యం కాదుకదా. అందుకే బులెట్ రైలు వేగంతో ఫైలు కదిలిపోయింది. ఒప్పందం కుదిరిపోయింది. ఒకసారి అసలు ఏమి జరిగింది అనేది పాయింట్ల వారీగా చూస్తే..
- ఆగస్టు 2021 లో జగన్ ను కలిసిన గౌతం అదానీ
- సెప్టెంబర్ 2021 న జగన్ ను కలిసిన సాగర్ అదానీ
- 2021 అక్టోబర్ మంత్రి వర్గ భేటీలో ఎజెండా..
- ఒప్పందం తో ఏటా 2 వేల కోట్ల ఆదా అని వెల్లడి
- సెకీ తో ఒప్పందం కోసం బులెట్‌లా పరుగులుపెట్టినఫైల్
- కేవలం 7 గంటల్లో మూడు శాఖలు, ముగ్గురు మంత్రులను
- సిఎంను చేరి…ఆపై క్యాబినెట్ ఆమోదం పొందిన ఫైల్…
- ఇంధన శాఖ కార్యదర్శి, గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ సిఎండి
- తరువాత ఆర్దిక శాఖ, అనంతరం సిఎస్, మంత్రి బాలినేని
- అక్కడినుండి సిఎంకు వెళ్లిన ఫైల్….
- ఒప్పందంపై లాభనష్టాలను అంచనా వెయ్యని విద్యుత్ శాఖ
- గ్రీన్ ఎనర్జీ పేరు మార్చి రూరల్ అగ్రీ ఏర్పాటు..
- సిఎండీ హోదాలో సంతకం చేసిన నాగులపల్లి శ్రీకాంత్…
- 2021లో ఏడువేల మెగావాట్ల విద్యుత్‌కు ఆమోద ముద్రవేసిన రెగ్యులేటరీ కమిషన్
MAHAA Vamsi Comment: చూశారుగా ఎంత వేగంగా అదానీ కంపెనీకి రెడ్ కార్పెట్ పరిచి వెల్ కమ్ చెప్పారో. అక్కడ అమెరికాలో ఎఫ్బీఐ కేసు నమోదు చేసేవరకూ ఇక్కడ మనదగ్గర అవినీతి కంపు ఎవరికీ చేరలేదు. ప్రభుత్వం మారినా.. అధికారులు ఇక్కడ జరిగిన తప్పును బయట పెట్టలేదు. ఈ వ్యవహారంలో రాజకీయంగా జగన్ ఎంత మురికి కూపంలో దిగారో.. అంతకు మించి అధికారులు ఆ మురికిని తమకు అంటించుకున్నారని చెప్పవచ్చు.
అదాని నుంచి జగన్ ముడుపులు వ్యవహారంలో కీలక అధికారులు పాత్ర వెలుగులోకి వచ్చింది. అపట్లో ఇంధన శాఖ కార్యదర్శిగా నాగుల పల్లి శ్రీకాంత్ విద్యుత్ ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు. సెకీతో ఒప్పందం పై ఇంధన శాఖ కార్యదర్శి హోదాలో నాగులపల్లి శ్రీకాంత్ సంతకాలు చేశారు. అదాని జగన్ కి ముడుపులు ఇచ్చారనే అమెరికా లో కేసు నమోదు తో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
MAHAA Vamsi Comment: సెకీతో విద్యుత్ ఒప్పందం కంటే ముందే 9 వేల మెగావాట్ల టెండర్లు పిలిచిన గ్రీన్ ఏనర్జీ కార్పోరేషన్. ఒక యూనిట్ విద్యుత్ ను రూ. 2.49 పైసలకే విద్యుత్ సరఫరాకు ముందుకు వచ్చిన సంస్థలు. అంతకంటే ముందు ఒక యూనిట్ విద్యుత్ ను రూ. 2.92 పైసలకు విద్యుత్ సరఫరా చేస్తామన్న అదాని సంస్ధ. గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ టెండర్ల లో ఒక యూనిట్ రూ.2.49 పైసలకు వస్తుండంటో..అదే ధరకు తాను సరఫరా చేస్తానని చేప్పిన అదాని సంస్థ..
గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్లు పిలిచిన టెండర్లు పక్కన పెట్టి అదాని సూచించినట్లు సెకీతో విద్యుత్ ఒప్పందం చేసుకుంది అప్పటి ఏపి ప్రభుత్వం. సెకీతో చేసుకున్న ఒప్పందంలో అప్పుడు ఎం ఓ యూ పై సంతకాలు చేసింది అధికారి శ్రీకాంత్ కావడం గమనార్హం.
7 వేల మెగావాట్ల విద్యుత్ ను అదాని – అజూర్ సంస్థలు ఉమ్మడిగా సరఫరా చేయాలనేది ఒప్పందం. దాని ప్రకారం అదాని 4763 మెగావాట్లు,అజూర్ సంస్ధ 2333 మెగావాట్లు కలిపి 7 వేల మెగావాట్లు విద్యుత్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, జగన్ కు ముడుపులు ఇచ్చే విషయంలో విభేదించి అజూర్ సంస్థ అర్ధాంతరంగా ఒప్పందం నుంచి వైదొలగింది.
MAHAA Vamsi Comment: అజూర్ సంస్థ సరఫరా చేస్తానన్న మేరకు విద్యుత్ ను అదాని సంస్ద చేసేలా 20223 డిసెంబర్ 10 అనుబంధ ఒప్పందం చేసుకున్న ఏపి ప్రభుత్వం. అ అనుబంద ఒప్పందంపై సంతకాలు చేసిన విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్.
MAHAA Vamsi Comment: ఇలా అధికారుల పాత్ర ఈ ఒప్పందంలో తక్కువది కాదు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మారింది. అమెరికాలో అదానీ చీకటి ఒప్పందాలపై కేసులు నమోదు అయ్యాయి. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేయాలి? అప్పటి అధికారులను విచారణ చేసి నిజానిజాలు తేల్చాలి కదా? ఆ అధికారులు నోరువిప్పితే అసలు ఈ ఒప్పందంలో జరిగింది ఏమిటి అనేది తెలుస్తుంది కదా? కానీ, ఆ దిశలో ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు కనిపించడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇంత పెద్ద అవినీతి బయటకు వచ్చినపుడు వెంటనే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించకుండా.. మీనమేషాలు లెక్కపెడుతుండడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. అందుకే వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో లోతైన దర్యాప్తును జరిపించాలి. నిజాలు నిగ్గు తేల్చాలి. ప్రజల సొమ్మును అవినీతితో వెనకేసుకున్న వారి విధానాలను బయట పెట్టాలి.
MAHAA Vamsi Comment: అయితే, ఈ విషయంలో ప్రభుత్వం ఆచి తూచి స్పందిస్తోన్నట్టు కనిపిస్తోంది. దీనికి కారణం కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దాని పై చంద్రబాబు సర్కార్ తర్జన భర్జన పడుతోంది. ఎందుకంటే, సెకీ తో ఒప్పందం రద్దు చేసుకుంటే 2900 కోట్లు ఎపి ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఆ ఒప్పందం ప్రకారం ఈ నిబంధన ఉండడంతో.. ప్రభుత్వం ఈ విషయంలో ఏమి చేయాలి అనేదానిపై జాగ్రత్తగా ఆలోచిస్తునట్టు కనిపిస్తోంది.
ఏది ఏమైనా.. జగన్ ఉచ్చులో పడిన అధికారులు ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఉరుకులు పరుగులు పెట్టడమే ఈ ఉదంతంలో విషాదం అని చెప్పవచ్చు. లోతైన దర్యాప్తుతోనే ఇందులో నిజానిజాలు బయటకు వస్తాయనేది సుస్పష్టం.