H1B Visa: అమెరికాలో ఇల్లు కొనాలి, పిల్లల్ని మంచి స్కూళ్లలో చదివించాలి, సొంతూళ్లో ఉన్న అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి.. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, కష్టాల తర్వాత గ్రీన్ కార్డ్ క్యూలో ఉంటూ ఇలాంటి కలలు కంటున్న వేలాది భారతీయ కుటుంబాల గుండెల్లో ఒక్కసారిగా బాంబు పేలింది. “రేపటి నుంచి మీ భార్య లేదా భర్త ఉద్యోగం చేయడానికి వీల్లేదు” అనే మాట వినబడితే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రస్తుతం యూఎస్‌లోని ప్రవాస భారతీయ (NRI) ఐటీ ఇళ్లల్లో సరిగ్గా ఇదే భయం, ఆందోళన మొదలయ్యాయి. ట్రంప్ పరిపాలనలో డిపెండెంట్ల వర్క్ పర్మిట్ (H-4 EAD)పై పునరాలోచన మొదలైందన్న వార్తలతో లక్షలాది మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
డబుల్ ఇన్‌కమ్ లేకపోతే డాలర్ దేశంలో కష్టమే!
బయట పనులు చేస్తే డిపోర్టేషనే: స్టూడెంట్ వీసాపై కేవలం యూనివర్సిటీ క్యాంపస్ లోపల మాత్రమే పరిమిత గంటలు పనిచేయడానికి చట్టం ఒప్పుకుంటుంది.
‘టాలెంట్ లేదా ట్రెజరీ’ – ట్రంప్ సరికొత్త ఫార్ములా..
-
అసాధారణ టాలెంట్ (Talent): దేశానికి అత్యంత అవసరమైన అరుదైన ప్రతిభ ఉన్న నిపుణులను మాత్రమే స్వాగతించడం.
-
భారీ ఖజానా (Treasury): మిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడిగా పెట్టి స్థానికులకు ఉద్యోగాలు కల్పించే ధనికులకు EB-5 లాంటి ‘గోల్డెన్ వీసా’ల ద్వారా ద్వారాలు తెరవడం.
ఇలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లో సోషల్ మీడియా వదంతులు నమ్మి ఎవరూ ఆందోళన చెందవద్దని లీగల్ నిపుణులు సూచిస్తున్నారు. ఏ కొత్త రూల్ వచ్చినా అమలు కావడానికి కొంత సమయం పడుతుంది, కోర్టుల్లో సవాళ్లు కూడా ఎదురవుతాయి. కాబట్టి అనధికారిక పనుల జోలికి వెళ్లకుండా, కేవలం గుర్తింపు పొందిన ఇమ్మిగ్రేషన్ లాయర్ల సలహాలను మాత్రమే పాటిస్తూ మీ వీసా స్టేటస్‌ను పక్కాగా కాపాడుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
