Ramayana

Ramayana: ప్రమోషన్స్ చేయని ‘రామాయణ’ మూవీ టీమ్..?

Ramayana: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘రామాయణ’  సినిమా . నితీశ్ తివారి  డైరెక్షన్ లో, ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా 2 పార్ట్స్ గా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుపై స్టార్టింగ్ నుంచే దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. ప్లాన్ ప్రకారం తొలి భాగం మరో రెండు నెలల్లో, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే విడుదలకు అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ, మూవీ టీమ్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రచార హడావుడి కనిపించకపోవడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా ఇంతటి పాన్-ఇండియా మెగా ప్రాజెక్టుకు నెలల ముందే టీజర్లు, పోస్టర్లు, దేశవ్యాప్త ప్రచారాలతో హోరెత్తిస్తారు. కానీ ‘రామాయణ’ టీమ్ ఎందుకు ఇంకా సైలెంట్‌గా ఉందనే విషయంపై ముంబై మీడియా వర్గాల్లో పలు ఆసక్తికర కారణాలు వినిపిస్తున్నాయి.
బిజినెస్ డీల్స్ ఒత్తిడి – ప్రమోషన్లకు బ్రేక్..
నిర్మాణ వ్యయం దృష్ట్యా, ఉత్తరాది మరియు దక్షిణాది మార్కెట్లలో థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కుల బిజినెస్ డీల్స్‌పై ప్రస్తుతం చిత్ర బృందంపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు సమాచారం.
బిజినెస్ లెక్కలు ఒక కొలిక్కి రాకముందే భారీ ప్రచారానికి వెళ్లడం కంటే, డీల్స్ పూర్తయ్యాక దూకుడు పెంచాలని నిర్మాతలు భావిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
‘టాక్సిక్’ ఫలితం తెచ్చిన తలనొప్పి?..
ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర ప్రమోషన్లలో యశ్ పాత్ర అత్యంత కీలకం. రణ్‌బీర్ కపూర్‌కు ఉత్తరాదిన ఉన్న క్రేజ్‌తో పాటు, దక్షిణాదిన యశ్ ఇమేజ్ ఈ సినిమాకు అతిపెద్ద అదనపు బలంగా మారుతుందని టీమ్ భావించింది.

 

అయితే, యశ్ నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’ విడుదలయ్యాక ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కించుకోకపోవడం ‘రామాయణ’ టీమ్‌ను పునరాలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. ‘టాక్సిక్’ రిజల్ట్ చూసిన తర్వాత ప్రచార వ్యూహాన్ని మార్చాలని ముందే అనుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు కొంతవరకు ఆందోళన కలిగిస్తున్నాయని సమాచారం.

రేసులోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది

రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రంపై సహజంగానే అపారమైన భక్తి, గౌరవం, అంచనాలు ఉన్నాయి. రణ్‌బీర్–యశ్ కలయిక తెరపై అద్భుతం చేస్తుందనడంలో సందేహం లేదు. కానీ విడుదల తేదీ సమీపిస్తున్న వేళ, ప్రేక్షకుల్లో సినిమా పట్ల నిరంతర ఆసక్తిని, వైబ్‌ను సృష్టించాలంటే టీమ్ తక్షణమే రంగంలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఒక పక్కా ప్రణాళికతో టీజర్, ట్రైలర్ విడుదల చేసి ప్రమోషన్ల జోరును పెంచుతారా లేదా అన్నది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *