Air India: 36 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం.. ఒక్కసారిగా ఉన్నట్టుండి నియంత్రణ కోల్పోయి అటూఇటూ కాదలడంతో సీట్లలో కూర్చున్న ప్రయాణికులు, డ్యూటీలో ఉన్న సిబ్బంది పైకప్పుకు బలంగా గుద్దుకుని కేకలు చేస్తే? సరిగ్గా నెల క్రితం ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన 137 మందికి అచ్చం అలాంటి భయానక అనుభవమే ఎదురైంది. సాంకేతిక లోపాలతో క్షణాల పాటు గాల్లో నియంత్రణ తప్పిన ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక దర్యాప్తు నివేదికను విడుదల చేసింది.
అయితే, ఈ నివేదికలో బయటపడిన ఒక చేదు నిజం ప్రయాణికుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆ సమయంలో విమానాన్ని నడిపిన 34 ఏళ్ల కెప్టెన్ సైకోయాక్టివ్ డ్రగ్స్ (మత్తు పదార్థాలు) తీసుకున్నట్లు వైద్యగాల్లో తీవ్ర కుదుపులు.. పైలట్‌కు డ్రగ్ పాజిటివ్.. ఎయిరిండియా విమాన ప్రమాదం వెనుక విస్తుపోయే నిజాలు!
36 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం.. ప్రయాణికులంతా ప్రశాంతంగా తమ తమ సీట్లలో సేదతీరుతున్నారు. అంతలోనే ఊహించని కుదుపు. కొన్ని సెకన్ల వ్యవధిలోనే సీట్లలో ఉన్నవారు ఎగిరి పడ్డారు. సీలింగ్‌లు పగిలిపోయాయి.. అరుపులు, కేకలతో విమానంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది.
గత నెలలో థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా (AI 2379) విమానంలో జరిగిన ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక దర్యాప్తు నివేదిక విడుదల చేసింది. ఇందులో విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యలతో పాటు, విమానాన్ని నడిపిన చీఫ్ పైలట్‌కు సంబంధించిన ఒక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
ఆకాశంలో కొన్ని క్షణాల నరకం
విమానం 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ‘హైడ్రాలిక్ సిస్టమ్’ విఫలమైంది. సాధారణంగా విమానం కదలికలను నియంత్రించే మూడు ప్రధాన హైడ్రాలిక్ వ్యవస్థలు (గ్రీన్, బ్లూ, ఎల్లో) సెకన్ల తేడాలో ప్రెషర్ కోల్పోయాయి. దాంతో ఆటోపైలట్ వ్యవస్థ ఆగిపోయింది.
-
విమానం ఒక్కసారిగా 372 అడుగులు పైకి లేచి, ఆ వెంటనే 292 అడుగులు కిందకు జారిపడింది.
-
సీట్ బెల్ట్ సైన్స్ అప్పటికే ఆఫ్‌లో ఉండటంతో, నిలబడి ఉన్న సిబ్బంది, సీట్ బెల్ట్ పెట్టుకోని ప్రయాణికులు ఒక్కసారిగా ఎగిరి పైకప్పుకు బలంగా ఢీకొన్నారు.
-
విమానం లోపల లగేజీ బాక్స్‌ల డోర్లు, సీలింగ్ ప్యానెల్స్ విరిగిపడ్డాయి. వాష్‌రూమ్ పరికరాలు పెకిలించుకుపోయాయి.
-
అదృష్టవశాత్తూ కొద్ది క్షణాల్లోనే హైడ్రాలిక్ వ్యవస్థలు మళ్లీ సాధారణ స్థితికి రావడంతో పైలట్లు విమానాన్ని అదుపులోకి తెచ్చారు.
ఈ కుదుపుల కారణంగా విమానంలో ఉన్న 137 మందిలో 24 మంది (20 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది) తీవ్రంగా గాయపడ్డారు.
ఢిల్లీలో సురక్షిత ల్యాండింగ్.. ఆస్పత్రికి క్షతగాత్రులు
అంతటి తీవ్ర సాంకేతిక సమస్య ఎదురైనా, సమీపంలోని మరో ఎయిర్‌పోర్టుకు మళ్లించకుండా పైలట్లు విమానాన్ని నేరుగా ఢిల్లీకే తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్య బృందాలు క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించాయి. 20 మందిని చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేయగా, తీవ్ర గాయాలైన నలుగురిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
పైలట్ డ్రగ్ టెస్ట్ కలకలం
ఈ ప్రమాదంపై విచారణ ప్రారంభించిన అధికారులు పైలట్లకు నిర్వహించిన పరీక్షల్లో ఊహించని విషయం బయటపడింది. ఇద్దరు పైలట్లకు ఆల్కహాల్ టెస్ట్ చేయగా నెగెటివ్ వచ్చింది. అయితే, 34 ఏళ్ల కెప్టెన్ (పైలట్-ఇన్-కమాండ్) సైకోయాక్టివ్ సబ్‌స్టాన్స్ (మత్తు పదార్థాలు/నిషేధిత డ్రగ్స్) స్క్రీనింగ్‌లో మాత్రం పాజిటివ్ (‘నాన్-నెగెటివ్’) అని తేలింది. తదుపరి బ్లడ్ టెస్టులో కూడా కెప్టెన్ మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. కో-పైలట్‌కు మాత్రం క్లీన్ చిట్ వచ్చింది.
ప్రయాణికుల ప్రాణాలను గాల్లో ఉంచి నడిపే పైలట్ రక్తంలో ఇలాంటి పదార్థాలు ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని AAIB పేర్కొంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)ను ఆదేశించింది.
అసలు కారణం ఇంకా తేలాల్సి ఉంది
విమానం హైడ్రాలిక్ ఫెయిల్యూర్‌కు, కెప్టెన్ తీసుకున్న మత్తు పదార్థానికి ఏమైనా సంబంధం ఉందా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ప్రాథమిక నివేదిక కేవలం జరిగిన సంఘటనలను మాత్రమే ధ్రువీకరించింది. బ్లాక్ బాక్స్ (CVR), ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) సమాచారాన్ని అధికారులు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. ఫ్రాన్స్ నుంచి ఎయిర్‌బస్ సాంకేతిక నిపుణులు కూడా విమానాన్ని పరిశీలించారు. సమగ్ర దర్యాప్తు పూర్తయిన తర్వాతే విమానంలో ఆ మూడు వ్యవస్థలు ఒకేసారి ఎందుకు ఫెయిలయ్యాయనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
