Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా పెట్టిన తాజా పోస్ట్ తీవ్ర సంచలనం రేపుతోంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన అనంతరం ఆమె తన తదుపరి రాజకీయ అడుగుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా, “ఇక నిరీక్షణ ముగిసింది.. అతిత్వరలోనే ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తాను.. బిగ్ అప్డేట్ సూన్, స్టే ట్యూన్ తెలంగాణ” అంటూ సురేఖ పేరుతో వచ్చిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఎంతోకాలంగా కొనసాగుతున్న రాజకీయ సస్పెన్స్‌కు తెరదించుతూ ‘ది వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్’ అంటూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుండగా, భవిష్యత్ కార్యాచరణపై ఆమె తీసుకోబోయే సంచలన నిర్ణయం ఏమిటనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది.
