Konda Surekha

Congress: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌!.. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు..!

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొద్ది రోజులుగా సాగుతున్న అంతర్గత విభేదాలు చివరకు తీవ్ర పరిణామానికి దారితీశాయి. మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి అధికారికంగా బర్తరఫ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్‌భవన్‌ (లోక్‌భవన్‌)కు వెళ్లి గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించాలని కోరుతూ సీఎం అధికారికంగా సిఫార్సు లేఖను అందజేశారు. సీఎం చేసిన ఈ సిఫార్సును గవర్నర్ తక్షణమే ఆమోదించడంతో ఆమె మంత్రి పదవి రద్దయినట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
ఇటీవల పార్టీ అంతర్గత వ్యవహారాలు, ముఖ్యమంత్రి నిర్ణయాలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపినప్పటికీ, రాజీ ఫార్ములా ఫలించకపోవడం, ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. పార్టీ లైన్ దాటి మాట్లాడే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవన్న సంకేతాన్ని పంపుతూ ప్రభుత్వం ఈ ముందడుగు వేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *