Rashmika Mandanna

Rashmika Mandanna: ఇంట్లో ఉన్న రోజులని మిస్ అవుతున్న.. సెట్స్ నుండి రష్మిక

Rashmika Mandanna: నిన్న రోమాంచకం ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ రష్మిక ఇంజురీ నుండి కోలుకున్నారు అని చెప్పి కొన్ని గంటలు కాకముందే రష్మిక తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అభిమానులతో పంచుకున్నారు. అందులో ఆమె ఇంట్లో ఉన్న రోజులను మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చారు. ఇంట్లో ఉన్నప్పుడు పజిల్ ఇంకా డాగ్‌తో ఆడుకోవడం, అలాగే జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేసిన విషయాలతో పాటు వరలక్ష్మీ వ్రతం రోజు చేసిన పూజ ఫోటోలు షేర్ చేసుకున్నారు.

మైసా సినిమా షూటింగ్ సమయంలో రష్మిక గాయపడ్డారు. ఓ సాంగ్ షూట్ సమయంలో ఆమె తుంటి భాగంలో గాయం కావడంతో డాక్టర్స్ 8 వీక్స్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా చెప్పారు. దీంతో ఆమె ఆ సమయాన్ని ఇంట్లో గడిపారు. ఇప్పుడు మళ్లీ సెట్స్‌లోకి వెళ్లడంతో ఆమె ఈ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆమె హెల్త్ బాగుపడడంతో ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *