Srisailam Tragedy: ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీశైలంలో అత్యంత విషాదకర ఘటన వెలుగుచూసింది. కష్టాలు తీరాలని, మనశ్శాంతి దొరుకుతుందని స్వామివారి సన్నిధికి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక వడ్డెర సత్రంలోని గదిలో చోటుచేసుకున్న ఈ ఘోరం స్థానికులను, భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆత్మహత్యకు గల ప్రాథమిక కారణాలు..
సుధాకర్ గతంలో బత్తలపల్లిలో ఆటో యూనియన్ నాయకుడిగా పనిచేస్తూ సుమారు కోటి రూపాయల వరకు అప్పులు చేసినట్లు సమాచారం. అప్పుల ఒత్తిడి తట్టుకోలేక కొంతకాలం ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది. ఇంకో పక్కన ఇద్దరు అక్కలను భర్తలు వదిలేయడం, మరో అక్కకు వివాహం కాకపోవడం, పైగా శ్రీదేవి అనే మహిళ పక్షవాతంతో బాధపడుతుండటంతో కుటుంబం తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైంది. వైద్యం కోసం విరూపాక్షపురం వెళ్లి, అక్కడి నుంచి శ్రీశైలం వచ్చి ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు.
దేవస్థానం అధికారుల తనిఖీ – సత్రాల నిబంధనలపై ఆగ్రహం..
-
సత్రం నిర్వాహకులకు నోటీసులు: క్షేత్ర నిబంధనల ప్రకారం ఏ సత్రంలోనూ భక్తులకు 48 గంటలకు మించి గదులు ఇవ్వకూడదని, కానీ నెల రోజులుగా వీరికి ఎలా రూమ్ ఇచ్చారని దేవస్థానం అధికారులు సత్రం యాజమాన్యాన్ని నిలదీశారు. నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.
-
సమగ్ర దర్యాప్తునకు ఆదేశం: పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి విషాదం జరగడం ఎంతో బాధాకరమని, ఎంతటి కష్టాలు ఉన్నా ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని వారు పేర్కొన్నారు. ఘటనపై పూర్తి విచారణ జరపాలని పోలీసులను కోరారు.
