Anasuya Bharadwaj: బుల్లితెర యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి వెండితెరపై నటిగా తనదైన ముద్ర వేసుకున్న అనసూయ భరద్వాజ్, సామాజిక మాధ్యమాల్లో నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల కొన్ని వివాదాల అనంతరం, తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
-
తల్లిని చూసి కలిగిన బాధ: మా నాన్నగారు చనిపోయి మూడేళ్లవుతోంది. అంతకుముందు మా అమ్మ నుదుటిన బొట్టు, కళ్లకు కాటుక, చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలతో ఎంతో అందంగా ఉండేది. కానీ నాన్న చనిపోయాక పది మంది ఏమనుకుంటారోనన్న భయంతో అవన్నీ మానేసింది. అమ్మను అలా చూడటం ఒక కూతురిగా నన్ను తీవ్రంగా కలచివేసింది.
-
ఆచారాలను ప్రశ్నించిన తీరు: ఆడపిల్లలకు పుట్టుకతోనే బొట్టు, కాటుక, గాజులు, గోరింటాకులను అలవాటు చేసేది అమ్మ, అమ్మమ్మలే. పెళ్లికి ముందే ఇవన్నీ మన జీవితంలో భాగమైనప్పుడు.. వీటిని భర్తతోనే ఎందుకు ముడిపెట్టాలి? ఒకవేళ వదిలేయాల్సి వస్తే నేర్పించిన అమ్మమ్మ లేదా అమ్మ చనిపోయినప్పుడు వదిలేయాలి కదా? బొట్టు పెట్టుకోవడమనేది పూర్తిగా మహిళల వ్యక్తిగత ఇష్టం. పూజలు, శుభకార్యాల్లో మహిళలపై బలవంతంగా ఇలాంటి ఆంక్షలు ఎందుకు రుద్దుతారు? అని నిలదీశారు.
నెట్టింట మిశ్రమ స్పందన – భగ్గుమన్న వాదోపవాదాలు
-
సమర్థించే వర్గం: ఆధునిక సమాజంలో మహిళల స్వేచ్ఛ, వారి ఇష్టాయిష్టాలు ముఖ్యమని, శతాబ్దాలుగా వస్తున్న పాత ఆంక్షలను ప్రశ్నించడంలో తప్పులేదని కొందరు నెటిజన్లు ఆమె అభిప్రాయాలను సమర్థిస్తున్నారు.
- వ్యతిరేకించే వర్గం: సనాతన సాంప్రదాయాలు, హైందవ ఆచారాలలో ప్రతి సంప్రదాయానికి ఒక అంతరార్థం ఉంటుందని, వాటిని వ్యక్తిగత వివాదాలతో ముడిపెట్టి విమర్శించడం సరికాదని సంప్రదాయవాదులు మండిపడుతున్నారు.
ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది నెటిజన్లు.. ఇంకో విధంగా ఆమెను ప్రశ్నిస్తున్నారు. “కట్టుబొట్టు గురించి ఇంత గొప్పగా మాట్లాడిన మీరు.. భర్త బతికి ఉన్నప్పుడే బొట్టు, గాజులు, పట్టీలు లేకుండా తిరుగుతున్నారు కదా! షోలు, ఇంకా షూటింగ్ సమయంలో తప్ప మీరు ఎప్పుడైనా తెలుగు సాంప్రదాయంలో కనిపించారా?” అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం “ఈ రోజుల్లో హిందూ సాంప్రదాయాల గురించి విమర్శించడం అందరికీ అలవాటైపోయింది” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
