Veligonda Project: ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల మూడు దశాబ్దాల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారం కాబోతోంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములు, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మూడో విడత పునరావాస, పునర్నిర్మాణ (R&R) ప్యాకేజీ కింద రూ. 250 కోట్ల పరిహారం చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వాసిత కుటుంబాలకు అందజేశారు.
-
మూడో విడత పంపిణీ: తాజా విడతలో 2,027 కుటుంబాలకు రూ. 250 కోట్ల మేర ఆర్థిక సాయం అందజేశారు.
-
మొత్తం చెల్లింపులు: గతంలో రెండు విడతల్లో అందించిన మొత్తంతో కలిపి ఇప్పటివరకు మొత్తం 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ. 768 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేశారు.
-
ఆర్ & ఆర్ పనులు: పునరావాస కాలనీలు, మౌలిక వసతుల కల్పన పనులు ఇప్పటికే 85 శాతం పూర్తయ్యాయని అధికారులు వివరించారు.
1996లో శంకుస్థాపన చేశా.. 2026లో ప్రారంభిస్తున్నా– చంద్రబాబు..
-
మూడు దశాబ్దాల ప్రస్థానం: 1995లో ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు ప్రజలు తాగునీటి కోసం పడుతున్న కష్టాలు, రైతుల కన్నీళ్లు నన్ను కదిలించాయి. 1996లో నేనే ఈ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశాను. 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ నా చేతుల మీదుగానే దీన్ని ప్రారంభించుకునే అవకాశం రావడం నా అదృష్టం. గత రెండేళ్ల కాలంలోనే రూ. 2,250 కోట్లు ఖర్చు చేసి పనులను పరుగులు తీయించాం అని పేర్కొన్నారు.
-
కరువు, ఫ్లోరైడ్ రహిత ప్రాంతమే లక్ష్యం: ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లోని కరువు పీడిత, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలైన 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 23 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. ఆగస్టు 31న టన్నెల్స్ ద్వారా 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్‌కు విడుదల చేయనున్నారు.
నదుల అనుసంధానం & స్థానిక అభివృద్ధి ప్రణాళికలు..
-
నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారం: పోలవరం పూర్తి చేసి కృష్ణా డెల్టాను ఆదుకోవడంతో పాటు శ్రీశైలంలో మిగిలే జలాలను రాయలసీమ, ప్రకాశం, నెల్లూరులకు మళ్లించవచ్చని చెప్పారు. దేశవ్యాప్త నీటి సమస్య పరిష్కారానికి గంగా–గోదావరి–కావేరి నదుల అనుసంధానమే సరైన మార్గమని పునరుద్ఘాటించారు.
-
మార్కాపురంలో హార్టికల్చర్ హబ్: మార్కాపురం ప్రాంతంలో ప్రతి ఇంటికీ జల్ జీవన్ మిషన్ ద్వారా కుళాయి నీటిని అందిస్తామని, సెప్టెంబరులో ఈ ప్రాంతంలో పెద్ద హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు.
