Mega 158

Mega 158: ఇది సత్య మాట.. ఇంకా డౌటా?.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న టైటిల్ గ్లింప్స్!

Mega 158: ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి  కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా #Mega158 నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్‌ను ప్రకటిస్తూ మూవీ టీమ్ పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.

ఈ సినిమాకి ‘కాకా’ (Kaaka) అనే మాస్ టైటిల్‌ను ఖరారు చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై నిర్మాత వెంకట్ కె నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.
గ్లింప్స్ హైలైట్స్ – క్లాస్ సూపర్ వైజర్ నుంచి వింటేజ్ గ్యాంగ్‌స్టర్ లుక్ వరకు..
విడుదలైన వీడియో గ్లింప్స్ మెగా అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించేలా సాగింది..
  • ‘కె. సత్యం’గా హుందాగా ఎంట్రీ: ఆక్వా సంస్థలో పనిచేసే మిడిల్ ఏజ్డ్ ఉద్యోగి ‘కె. సత్యం’గా కళ్లద్దాలు ధరించి చిరంజీవి నార్మల్ మిడిల్ క్లాస్ వ్యక్తిగా ఉన్న లుక్‌లో కనిపించారు. చెన్నై టీమ్‌తో ఫోన్ మాట్లాడుతూ లోడ్ సమయానికి చేరుతుందని భరోసా ఇవ్వడం, పండుగ టార్గెట్ పేరుతో సునీల్ అడిగిన లీవ్ తిరస్కరించడం లాంటి సన్నివేశాలతో గ్లింప్స్ ఆసక్తికరంగా మొదలవుతుంది.
  • నీటిలోంచి బయటపడ్డ గన్స్: గెటప్ శ్రీను స్కూటర్ కీస్ పొరపాటున నీటిలో పడిపోగా.. ఓ కుక్క రిమోట్‌ను తీసుకురావడం, ఆ రిమోట్ మాగ్నెట్ సాయంతో కీస్‌ను బయటకు తీసే క్రమంలో లోపలి నుంచి భారీ తుపాకులు బయటకు రావడం అదిరిపోయే ట్విస్ట్.
  • వింటేజ్ చిరంజీవి స్టైల్ & ‘ఐ లవ్ డాడీ’ కీచైన్: ఆ వెంటనే ‘కాకా’ టైటిల్ రివీల్ కావడం, ఫ్లాష్‌బ్యాక్‌లో యంగ్ & స్టైలిష్ లుక్‌లో చిరంజీవి గన్స్ పేలుస్తూ ఇచ్చిన మాస్ పోజ్ పాత ‘గ్యాంగ్ లీడర్’ నాటి వింటేజ్ వైబ్స్‌ను గుర్తుచేస్తోంది. అలాగే గ్లింప్స్‌లో కనిపించిన ‘I Love Daddy’ కీచైన్ తండ్రీకొడుకుల మధ్య బలమైన ఎమోషనల్ బాండింగ్‌ను సూచిస్తోంది.

తమన్ బీజీఎం – సంక్రాంతి 2027 బరిలో ‘కాకా’..

  • మ్యూజిక్ & టెక్నికల్ వేల్యూస్: సంగీత దర్శకుడు ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అందులో ఐకానిక్ “గ్యాంగ్ గ్యాంగ్” రీమిక్స్ బీట్‌ను జతచేయడం గ్లింప్స్ స్థాయిని పెంచేసింది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది.
  • తారాగణం: ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేథా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. సునీల్, గెటప్ శ్రీను ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కోన వెంకట్, చక్రవర్తి రెడ్డి, భాను-నందు రచనా సహకారం అందించారు.
  • రిలీజ్ డేట్: ఈ భారీ మాస్ ఎంటర్‌టైనర్‌ను 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

‘ఇది సత్య మాట.. ఇంకా డౌటా?’ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *