Andhra Pradesh

Andhra Pradesh: రైతు నిరక్షరాస్యులను ఆసరాగా తీసుకున్న ఓ ప్రబుద్ధుడు

Andhra Pradesh: దువు రాని వాళ్లకు సహాయం చేయాల్సింది పోయి.. నిండా ముంచేస్తున్నాడు. నిరక్షరాస్యులను ఆసరాగా చేసుకున్న ఓ ప్రబుద్ధుడు మోసాలకు పాల్పడుతున్నాడు. తాజాగా ఏటీఎం సెంటర్‌లో డబ్బులు విత్ డ్రా చేయడం ఎలాగో తెలియని రైతును ఓ దొంగ మోసం చేసిన తీరు సీసీ కెమెరాలో రికార్డు అయింది. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ఏటీఎం సెంటర్‌లో డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి సహాయం చేస్తున్నట్లు నటించి ఏటీఎం కార్డు మార్చి డబ్బులు కాజేశాడు ఓ దొంగ.

అనంతపురం జిల్లా రవకొండ పట్టణంలోని కెనరా బ్యాంక్ ఏటీఎంలో నగదు తీసుకోవడం కోసం ఖాయంపల్లి గ్రామానికి చెందిన నెట్టికల్లు అనే వ్యక్తి ఏటీఎం సెంటర్‌కు వచ్చాడు. ఏటీఎం సెంటర్‌లో కార్డ్ పెట్టి డబ్బులు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే, డబ్బులు ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలియక అలాగే నిల్చున్నాడు. ఇంతలో ఓ దొంగ ఏటీఎం సెంటర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. డబ్బులు తీసి ఇస్తున్నట్లు నటించి, చాకచక్యంగా కళ్ళముందే ఏటీఎం కార్డు మార్చేశాడు.

Andhra Pradesh: రైతు నెట్టికల్లు డబ్బులు డ్రా చేయమని సహాయం కోరగా… ఏటీఎం కార్డు తీసుకుని మెషిన్ లో పెట్టి, పిన్ నెంబర్ ఎంటర్ చేశాడు. మెషిన్ నుంచి కార్డు బయటికి తీసి అంతలోనే ఏటీఎం కార్డును మార్చేశాడు. తన దగ్గర ఉన్న డమ్మీ ఏటీఎం కార్డును బాధితుడు నెట్టికల్లుకి ఇచ్చి డబ్బులు రావడం లేదంటూ, ఎంచక్కా ఏటీఎం సెంటర్ నుంచి జారుకున్నాడు. ఇక్కడ బాధితుడు ఏటీఎం సెంటర్‌లో డబ్బులు డ్రా చేయకపోయినా, 75 వేల రూపాయలు నగదు విత్ డ్రా అయినట్లు బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో షాక్ అయ్యాడు సదరు రైతు.ఏటీఎం సెంటర్లో అసలు డబ్బులే తీసుకోలేదని, అకౌంట్ నుంచి డబ్బులు ఎలా కట్ అయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఏటీఎం సెంటర్‌లోని సీసీ ఫుటేజ్ పరిశీలించి ఖంగుతిన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Congress Worker Murder: వీడిన మిస్టరీ.. కాంగ్రెస్ కార్యకర్తను అందుకే చంపాడు.. ఒప్పుకున్న నిందితుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *