Dulquer Salmaan

Dulquer Salmaan: బర్త్ డే స్పెషల్.. ఆకాశంలో ఒక తార’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

Dulquer Salmaan: వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర యూనిట్ ఈరోజు (మంగళవారం) ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ను విడుదల చేసింది. జివి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ‘చిట్టి చిట్టి చీమ’ పాట హృదయాన్ని హత్తుకునే మెలోడి.. భావోద్వేగంగా సినిమాలో ఏం చెప్పాల‌నుకున్నారో ఆ పాయింట్‌ను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. హీరోయిన్ కోణంలో పాడిన ఈ పాట, నక్షత్రాలను చేరాలనే ఒక మహిళ కలను, ఆమె పక్కన నిలబడి నిశ్శబ్దంగా అండగా నిలిచే వ్యక్తి ప్రేమను చూపిస్తుంది. సాంప్రదాయ ప్రేమకథలను దాటి, ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఈ పాట అందంగా సెలబ్రేట్ చేస్తుంది.

శ్రీమణి రాసిన‌ ఈ పాటను రమ్య బెహరా ఎంతో చ‌క్క‌గా ఆలపించారు. చిట్టి చీమ చక్కెర మోసుకెళ్లడం, కొండపల్లి బొమ్మ కొండలు దాటడం, గాలికి ఎదురుగా మాత్రమే ఎగిరే గాలిపటం వంటి ఆకర్షణీయమైన ఉపమానాల ద్వారా ఈ పాట పట్టుదల, ఆశ, ప్రతి కల వెనుక ఉన్న నిశ్శబ్ద బలాన్ని అద్భుతంగా ఆవిష్క‌రించింది.

ఆకాశంలో ఒక తార చిత్రంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పావన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *