Blockchain Pilot Project

Blockchain Pilot Project: ఇకపై ఏపీలో భూమి కబ్జా చేయడం అసాధ్యం.. సీఎం చంద్రబాబు సరికొత్త ప్రాజెక్ట్ ప్రారంభం!

Blockchain Pilot Project: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు (జులై 23) ‘మీ భూమి – బ్లాక్ చైన్’ (Mee Bhoomi – Blockchain) పైలట్ ప్రాజెక్టును డిజిటల్ విధానంలో ప్రారంభిస్తారు. భూ రికార్డుల్లో అక్రమాలు, మార్పులు చేర్పులు ఇంకా భూకబ్జాలకు చెక్ పెడుతూ.. ప్రజల ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించేలా ఈ అత్యాధునిక సాంకేతికతను రూపొందించారు.

1. ఎలా పనిచేస్తుంది? లాభాలు ఏంటి?

ఈ టెక్నాలజీ వల్ల భూమి వివరాలను ఎవరూ దొంగతనంగా లేదా అక్రమంగా మార్చడం ఇక్కపైన కుదరదు. ప్రతి భూ భాగానికి ఒక ప్రత్యేక ఐడీ (Blockchain ID) కేటాయిస్తారు. దింతో ఏ అధికారి, ఏ సమయంలో భూమి వివరాల్లో మార్పులు చేశారో స్పష్టంగా తెలుస్తుంది. ఏమైనా తప్పులు లేదా తేడాలు ఉంటే సిస్టమ్ ఆ లావాదేవీని స్వయంగా ఆపివేస్తుంది.భూమిపై నిజమైన యజమానికి సంపూర్ణ హక్కులు ఉంటాయి. భూములు అమ్మాలన్నా, కొనాలన్నా లేదా బ్యాంకు రుణాలు పొందాలన్నా మోసాలు జరిగే అవకాశమే తాగుతుంది అని చెపొచ్చు.

2. తొలిదశలో 7 మండలాలు.. 89 గ్రామాలు!

ఈ పైలట్ ప్రాజెక్టును మొదటి విడతగా రాష్ట్రంలోని 7 జిల్లాల్లోని 7 మండలాల్లో అమలు చేస్తున్నారు.. అస్పరి (కర్నూలు), పెనుమూరు (చిత్తూరు), రేపల్లె (బాపట్ల), గన్నవరం (కృష్ణా), కడియం (తూర్పు గోదావరి), గుమ్మలక్ష్మీపురం (పార్వతీపురం మన్యం), కొత్తవలస (విజయనగరం).మొత్తం 89 రీ-సర్వే పూర్తి చేసుకున్న గ్రామాలు, 1.37 లక్షల ల్యాండ్ పార్సెల్ మ్యాప్‌లు ఈ పరిధిలోకి వస్తాయి. ఆటో మ్యూటేషన్, సబ్-డివిజన్ వంటి 8 రకాల రెవెన్యూ సేవలు ప్రజలకు సులభంగా అందుతాయి.

3. భూ సంస్కరణల్లో కొత్త విప్లవం!

ప్రస్తుతం వెబ్‌ల్యాండ్ (Webland) విధానం ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల జరుగుతున్న తప్పుడు మార్పులను అరికట్టేందుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) ఈ ఫ్యాబ్రిక్ టెక్నాలజీని డెవలప్ చేసింది. ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌ను రాబోయే రోజుల్లో ఏపీ వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *