IRCTC

IRCTC: లడఖ్ స్పెషల్ ఆఫర్.. హైదరాబాద్ నుంచి తక్కువ బడ్జెట్‌లో 7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే!

IRCTC: నగర జీవితంలోని రోజువారీ పరుగుల నుంచి కాస్త ఉపశమనం పొంది, నీలాకాశం నేలను తాకే అద్భుత ప్రదేశానికి వెళ్లాలని ఉందా? నీలిరంగు సరస్సులు, ఎత్తైన మంచు పర్వతాలు, హృదయానికి హాయినిచ్చే చల్లనిగాలులు సంపూర్ణ ప్రశాంతతను అందిస్తాయి. పర్యాటక ప్రియుల కలల గమ్యస్థానమైన ‘లడఖ్’ అందాలను కళ్లారా వీక్షించేందుకు ప్రఖ్యాత ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

ప్యాకేజీ ముఖ్యాంశాలు

  • వ్యవధి: 6 రాత్రులు / 7 రోజులు

  • ప్రయాణ మార్గం: హైదరాబాద్ నుంచి లేహ్‌కు నేరుగా ఫ్లైట్ (రాను-పోను).

  • ప్రయాణ తేదీ: ఆగస్టు 13, 2026

7 రోజుల్లో సందర్శించే అద్భుత ప్రాంతాలు:

  1. లేహ్ (Leh): మొదటి రోజు లేహ్ చేరుకుని అక్కడి వాతావరణానికి అలవాటుపడేందుకు పూర్తి విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం లోకల్ మార్కెట్ సందర్శన ఉంటుంది. మరుసటి రోజు శాంతి స్థూపం, లేహ్ ప్యాలెస్ మరియు భారత సైన్యానికి అంకితమిచ్చిన ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’ మ్యూజియాన్ని తిలకిస్తారు.

  2. శామ్ వ్యాలీ (Sham Valley): గురుద్వారా పత్తర్ సాహిబ్ దర్శనంతో పాటు గురుత్వాకర్షణకు విరుద్ధంగా పనిచేసే వింతైన ‘మాగ్నెటిక్ హిల్’ (Magnetic Hill) ను సందర్శిస్తారు.

  3. నుబ్రా వ్యాలీ (Nubra Valley): మూడో రోజు దిక్షిత్ మరియు హుందర్ గ్రామాల పర్యటన ఉంటుంది. ఇక్కడ ద్వికుంభ (రెండు పింజెలున్న) ఒంటెలపై స్వయం ఖర్చుతో ప్రయాణించవచ్చు.

  4. తుర్తుక్ గ్రామం (Turtuk): నాలుగో రోజు భారతదేశపు చివరి సరిహద్దుల్లో ఉండే తుర్తుక్ గ్రామాన్ని సందర్శిస్తారు. ఇక్కడి సంస్కృతి, జీవన విధానం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

  5. పాంగోంగ్ సరస్సు (Pangong Lake): ఐదో రోజు ‘3 ఇడియట్స్’ సినిమా ద్వారా ప్రపంచ ప్రసిద్ధి చెందిన 120 కిలోమీటర్ల ఉప్పునీటి పాంగోంగ్ సరస్సు వద్ద సమయం గడుపుతారు. ఇది భారత్, చైనా సరిహద్దుల్లో విస్తరించి ఉంది.

  6. తిరుగు ప్రయాణం: పాంగోంగ్ నుంచి లేహ్ చేరుకునే క్రమంలో చాంగ్లా పాస్, తిక్సే మోనెస్ట్రీ మరియు షే ప్యాలెస్‌లను సందర్శిస్తారు.

ప్యాకేజీలో ఏమేమి లభిస్తాయి?

  • హైదరాబాద్ నుంచి లేహ్‌కు రానుపోను విమాన టికెట్లు.

  • హోటళ్లు / క్యాంపుల్లో బస (లేహ్‌లో 3 రాత్రులు, నుబ్రాలో 2 రాత్రులు, పాంగోంగ్ వద్ద 1 రాత్రి).

  • రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం మరియు రాత్రి భోజనం (మొత్తం 6 టిఫిన్లు, 6 లంచ్‌లు, 6 డిన్నర్లు).

  • పర్యటన కోసం ఏసీ లేని షేరింగ్ వాహనం.

  • ఇన్నర్ లైన్ పర్మిట్లు, పర్యాటక ప్రదేశాల ఎంట్రీ టికెట్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్.

  • టూర్ గైడ్ సేవలు మరియు ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రదర్శన (Cultural Show).

  • ప్రతిఒక్కరికీ రోజుకు ఒక లీటర్ తాగునీటి బాటిల్.

  • అత్యవసర పరిస్థితుల కోసం వాహనంలో ఆక్సిజన్ సిలిండర్ సదుపాయం మరియు ఐఆర్‌సిటీసీ టూర్ మేనేజర్ పర్యవేక్షణ.

ప్యాకేజీ ధరలు (ఒక్కొక్కరికి):

  • సింగిల్ ఆక్యుపెన్సీ (ఒక్కరే ఉంటే): ₹55,640

  • డబుల్ ఆక్యుపెన్సీ (ఇద్దరు ఉంటే): ₹54,380

  • ట్రిపుల్ ఆక్యుపెన్సీ (ముగ్గురు ఉంటే): ₹48,730

  • 5 నుండి 11 ఏళ్ల పిల్లలు (బెడ్‌తో సహా): ₹36,970

  • 5 నుండి 11 ఏళ్ల పిల్లలు (బెడ్ లేకుండా): ₹35,780

  • 2 నుండి 4 ఏళ్ల పిల్లలు: ₹35,720 (గమనిక: ఈ వయస్సు పిల్లల రుసుమును ఐఆర్‌సిటీసీ ఆఫీసులో నేరుగా క్యాష్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది).

ప్రయాణానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • లడఖ్ ఎత్తైన ప్రాంతంలో ఉండటం వల్ల ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ‘ఆక్యుట్ మాఉంటెన్ సిక్నెస్’ (AMS) బారిన పడకుండా ఉండేందుకు మొదటి రోజు ఖచ్చితంగా పూర్తి విశ్రాంతి తీసుకోలు.

  • వైద్యుల సలహా మేరకు ముందుగానే అవసరమైన ముందుజాగ్రత్త మందులు వెంట తీసుకెళ్లడం మంచిది.

  • శరీరంలో నీటి శాతం తగ్గకుండా నీళ్లు, గ్లూకోజ్, ఓఆర్‌ఎస్ (ORS) తాగుతూ ఉండాలి. మద్యం, అధిక ఆహారం మరియు యాంటిడిప్రెసెంట్ మందులకు దూరంగా ఉండాలి.

  • నుబ్రా, పాంగోంగ్ ప్రాంతాల్లోని క్యాంపులలో విద్యుత్ కేవలం కొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  • పాంగోంగ్ పరిసరాల్లో నెట్‌వర్క్, వైఫై, ఏటీఎంలు, పెట్రోల్ పంపులు ఉండవు. కాబట్టి అవసరమైనంత నగదు (Cash) ముందుగానే వెంట ఉంచుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *