Ramchander Rao Arrest

Ramchander Rao Arrest: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్

Ramchander Rao Arrest: ఢిల్లీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల సెగ తెలంగాణకూ తాకింది. హైదరాబాద్, కరీంనగర్‌లలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు నిర్వహించిన పోటాపోటీ ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

కరీంనగర్‌లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు కార్యాలయం ఎదుటే బైఠాయించి నిరసన తెలిపాయి. ఢిల్లీలో రాహుల్ గాంధీ నిరసనను ఖండిస్తూ బీజేపీ నేతలు హైదరాబాద్‌లోని గాంధీభవన్ ముట్టడికి పిలుపునివ్వడం, దానికి ప్రతిగా కాంగ్రెస్ నేతలు బండి సంజయ్ ఆఫీస్ వైపు దూసుకురావడంతో ఉద్రిక్తత పెరిగింది.

1. గాంధీభవన్ ముట్టడికి యత్నం.. బీజేపీ నేతల అరెస్ట్!

హైదరాబాద్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ‘గాంధీభవన్’ ముట్టడికి యత్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ అరెస్టుల సమయంలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర నెట్టోట, వాగ్వాదం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ శ్రేణులు నిరసన తెలిపాయి.

2. కరీంనగర్‌లో కాంగ్రెస్ నిరసనలు

కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్‌ను ముట్టడించేందుకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు మార్గమధ్యంలోనే నిలిపివేశారు. దీంతో వారు రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇరుపక్షాల వద్ద భారీగా మోహరించి భద్రతను పర్యవేక్షించారు. ఒకే రోజు హైదరాబాద్, కరీంనగర్‌లలో చోటుచేసుకున్న ఈ ఆందోళనలు, అరెస్టులు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వేడిని రాజేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *