Tholi Ekadashi 2026

Tholi Ekadashi 2026: పూజా ముహూర్తం, ఉపవాస నియమాలు.. పొరపాటున కూడా ఆ రోజు ఈ పనులు చేయకండి!

Tholi Ekadashi 2026: ప్రస్తుతం పవిత్రమైన ఆషాఢ మాసం కొనసాగుతోంది. వారాహి నవరాత్రి ఉత్సవాల ముగింపు తర్వాత వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశినే మనమంతా ‘తొలి ఏకాదశి’ (దేవశయని ఏకాదశి) గా జరుపుకుంటాం. హిందూ సంప్రదాయంలో ఈ పండుగకు అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది.

పురాణాల ప్రకారం ఈ తొలి ఏకాదశి నాటి నుంచే శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు క్షీరాబ్ధిలో యోగ నిద్రలోకి వెళ్తారు. అందుకే ఈ నాలుగు నెలల కాలాన్ని ‘చాతుర్మాసం’ అంటారు. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకుండా పూర్తి సమయం భగవంతుని ఆరాధనకే కేటాయిస్తారు.

దేవశయని (తొలి) ఏకాదశి 2026 తేదీ & ముహూర్తాలు

తిథి వివరాల ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథి జులై 24న ప్రారంభమైనప్పటికీ.. ఉదయ తిథి (సూర్యోదయ తిథి) ప్రామాణికంగా 2026 జులై 25, శనివారం నాడు తొలి ఏకాదశి పండుగను జరుపుకుంటారు.

  • ఏకాదశి తిథి ప్రారంభం: జులై 24 (శుక్రవారం) ఉదయం 10:08 గంటలకు

  • ఏకాదశి తిథి ముగింపు: జులై 25 (శనివారం) ఉదయం 11:54 గంటలకు

  • బ్రహ్మ ముహూర్తం: ఉదయం 04:16 నుండి 04:57 గంటల వరకు

  • పూజా ముహూర్తం: ఉదయం 07:21 నుండి 09:03 గంటల వరకు

  • అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:00 నుండి 12:55 గంటల వరకు

  • ఉపవాస విరమణ (పారణ): జులై 26న తెల్లవారుజామున 05:38 నుండి ఉదయం 08:22 గంటల వరకు

తొలి ఏకాదశి నాడు ఏమి చేయాలి?

  • పరిశుభ్రత: ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.

  • పూజా విధానం: విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవికి పసుపు పువ్వులు, తులసి దళాలతో పూజలు చేసి, ప్రసాదం సమర్పించాలి. విష్ణువు పూజలో తులసి ఆకులు అత్యంత ప్రధానం.

  • ఉపవాస దీక్ష: ‘ఏకాదశి వ్రతం’ ఆచరిస్తామని సంకల్పం చెప్పుకుని రోజంతా ఉపవాసం లేదా ఫలహారం తీసుకోవాలి.

  • దానధర్మాలు: ఈ పవిత్ర దినాన పేదలకు ధాన్యం, వస్త్రాలు, పానకం లేదా ధనం దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది.

ఈ రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు (నియమాలు)..

  • అన్నం తినకూడదు: ఏకాదశి రోజున అన్నం (బియ్యంతో చేసిన ఆహారం) అస్సలు తీసుకోకూడదు. తామసిక ఆహారం, మద్యం, మాంసానికి పూర్తిగా దూరంగా ఉండాలి.

  • తులసి ఆకులు కోయవద్దు: ఏకాదశి రోజున తులసి మొక్క నుండి ఆకులను తెంపకూడదు. పూజ కోసం ముందు రోజే ఆకులను కోసి ఉంచుకోవాలి.

  • తలస్నానం & క్షౌరం వద్దు: ఈ రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదని, అలాగే పురుషులు గోళ్లు, వెంట్రుకలు కత్తిరించుకోకూడదని పండితులు చెబుతారు.

  • సంయమనం: బ్రహ్మచర్యం పాటించాలి. స్త్రీలను, పెద్దలను అవమానించడం లేదా మనసులో ఇతరుల పట్ల చెడు ఆలోచనలు రానీయకూడదు.

శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో కష్టాలన్నీ తొలగిపోయి, జీవితంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు సిద్ధించాలని ఆకాక్షిస్తూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *