Face Mask

Face Mask: కేవలం పాలు, తేనె, నిమ్మరసంతో ఇన్‌స్టంట్ గ్లో.. తయారుచేసే పద్ధతి ఇదే!

Face Mask: ముఖంపై తక్షణమే గ్లో (మెరుపు) రావాలంటే.. ఇంట్లోనే తయారుచేసుకునే డీఐవై (DIY – Do It Yourself) పీల్ ఆఫ్ మాస్క్‌లు ఒక మ్యాజిక్‌లా పనిచేస్తాయి. ఇవి చర్మంపై పేరుకుపోయిన మురికిని, చనిపోయిన చర్మ కణాలను (Dead Skin) ఒకేసారి బయటకు తీసేస్తాయి. అయితే, కొందరి చర్మం కెమికల్స్‌తో కూడిన పీల్ ఆఫ్ మాస్క్‌ల పట్ల చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. మరికొందరు తక్కువ ఖర్చుతో కూడిన సహజమైన పద్ధతులను వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే కొన్ని బెస్ట్ పీల్ ఆఫ్ మాస్క్ రెసిపీలు ఇపుడు తెలుసుకుందాం.

1. హైడ్రేటింగ్ హనీ మిల్క్ పీల్ ఆఫ్ మాస్క్ (తేనె, పాలు)

చర్మంపై ఉన్న పొడిబారిన తనాన్ని (Dryness) దూరం చేసి, ముఖాన్ని తక్షణమే హైడ్రేట్ చేయడానికి ఈ హనీ మిల్క్ పీల్ ఆఫ్ మాస్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

కావలసిన పదార్థాలు:

  • 1 టేబుల్ స్పూన్ – అన్‌ఫ్లేవర్డ్ జెలటిన్ పౌడర్ (Gelatin Powder)

  • 1 టీస్పూన్ – తేనె

  • 1-2 చుక్కలు – ఎస్సెన్షియల్ ఆయిల్ (లావెండర్, టీ ట్రీ లేదా పెప్పర్‌మింట్ ఆయిల్)

  • 2 టేబుల్ స్పూన్లు – పాలు

తయారీ విధానం:

  • మొదట ఒక గిన్నెలో పాలు, జెలటిన్ పౌడర్ వేసి చిక్కటి పేస్ట్‌లా అయ్యేంత వరకు బాగా కలపాలి.

  • ఈ మిశ్రమంలో మీకు నచ్చిన ఎస్సెన్షియల్ ఆయిల్‌ను ఒకటి లేదా రెండు చుక్కలు వేయాలి.

  • చివరిగా తేనె కూడా వేసి, అన్ని పదార్థాలు కలిసేలా బాగా మిక్స్ చేయాలి.

  • ఇప్పుడు మీ ‘హైడ్రేటింగ్ హనీ మిల్క్ పీల్ ఆఫ్ మాస్క్’ రెడీ అయినట్లే.

ఎలా అప్లై చేయాలి?

  • ఈ మాస్క్ ఆరిపోయే కొద్దీ గట్టిగా మారుతుంది, కాబట్టి తయారు చేసిన వెంటనే ముఖానికి రాసుకోవాలి.

  • దీన్ని ముఖానికి సరిగ్గా అప్లై చేసి, ఆరిపోయే వరకు అలాగే ఉంచాలి. అయితే, దీనిని జుట్టు (Hairline) తగిలే ప్రాంతాల్లో రాయకూడదు.

  • గమనిక: సెన్సిటివ్ స్కిన్ (సున్నితమైన చర్మం) ఉన్నవారు ఎస్సెన్షియల్ ఆయిల్స్ వాడకపోవడం మంచిది.

2. లెమన్ అండ్ ఎగ్ పీల్ ఆఫ్ మాస్క్ (నిమ్మరసం, కోడిగుడ్డు)

చర్మం కాంతివంతంగా, బ్రైట్‌గా మెరిసిపోవడానికి ఈ పీల్ ఆఫ్ మాస్క్ చాలా బాగా పనిచేస్తుంది.

కావలసిన పదార్థాలు:

  • 1 – కోడిగుడ్డు తెల్లసొన (Egg White)

  • 1 టీస్పూన్ – నిమ్మరసం

  • 1/2 టీస్పూన్ – తేనె

  • 1 – టిష్యూ పేపర్ (Tissue Paper)

తయారీ విధానం:

  • ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో గుడ్డు తెల్లసొన, నిమ్మరసం వేసి బాగా కలపాలి.

  • ఆ తర్వాత ఈ మిశ్రమంలో తేనెను కూడా వేసి పూర్తిగా మిక్స్ చేయాలి.

  • ఇప్పుడు ‘లెమన్ అండ్ ఎగ్ పీల్ ఆఫ్ మాస్క్’ సిద్ధంగా ఉంది.

ఎలా అప్లై చేయాలి?

  • మొదట బ్రష్ సహాయంతో ఈ మిశ్రమాన్ని ముఖంపై ఒక పల్చని పొరలా (Thin Layer) అప్లై చేసి, దానిపై వెంటనే ఒక టిష్యూ పేపర్ ముక్కను అంటించాలి.

  • అలా అంటించిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి, మళ్లీ ఆ టిష్యూ పేపర్ పైన ఈ మిశ్రమాన్ని రెండో పొరలా రాయాలి.

  • దానిపై మళ్లీ ఇంకో టిష్యూ పేపర్ వేయాలి.

  • మీకు కావాలనుకుంటే.. ఇదే విధంగా టిష్యూ పేపర్ పైన మరోసారి మూడో లేయర్ వేసి, మళ్లీ టిష్యూ పేపర్‌తో కవర్ చేయవచ్చు.

  • ఈ మాస్క్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత, మెల్లగా తీసేసి సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *