Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణి సంరక్షణ చరిత్రలో ఒక అరుదైన, అత్యంత కీలకమైన అడుగు పడింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ముంబైలో కీలక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల (Eastern Ghats) అటవీ ప్రాంతంలో పులుల జనాభాను వృద్ధి చేయడం, వన్యప్రాణి సంరక్షణలో ఇరు రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు.
ఈ చర్చలు విజయవంతమవ్వడంతో, ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆడ పులులను (2 Female Tigers) బదిలీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. ఈ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
తూర్పు కనుమల్లో ‘అంతరసంతానోత్పత్తి’ సమస్యకు బ్రేక్!
ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న శాస్త్రీయ అవసరాన్ని, వన్యప్రాణి సమతుల్యతను డిస్ట్రిబ్యూషన్ పరంగా మంత్రి పవన్ కళ్యాణ్ క్షుణ్ణంగా వివరించారు:
-
ఆడ పులుల కొరత: ప్రస్తుతం ఏపీలోని తూర్పు కనుమల పరిధిలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనివల్ల అక్కడ పులుల సంఖ్య పెరగకపోగా తీవ్ర జన్యుపరమైన లోపాలు తలెత్తుతున్నాయి.
-
ఇన్‌బ్రీడింగ్ సమస్యకు చెక్: ఒకే ప్రాంతానికి చెందిన పులుల మధ్యే సంతానోత్పత్తి జరగడం వల్ల ‘అంతరసంతానోత్పత్తి’ (Inbreeding) సమస్య ఏర్పడి, పుట్టే పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది. ఇప్పుడు మహారాష్ట్ర నుండి వచ్చే కొత్త ఆడ పులుల వల్ల ఇక్కడ జన్యు వైవిధ్యం (Genetic Diversity) పెరిగి, ఆరోగ్యకరమైన పులుల తరం వృద్ధి చెందుతుంది.
-
స్వయం సమృద్ధి ఆవాసం: ఈ బదిలీ ప్రక్రియ ద్వారా తూర్పు కనుమలలో దీర్ఘకాలిక స్థిరత్వంతో కూడిన, ఒక సంపూర్ణ స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ (Eco-system) ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరు రాష్ట్రాల జాయింట్ యాక్షన్ ప్లాన్
శాస్త్రీయ విధానాలు, అంతర్జాతీయ వన్యప్రాణి నిర్వహణ ప్రమాణాల ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఏపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కట్టుబడి ఉన్నాయని ఈ సంయుక్త కార్యాచరణ నిరూపిస్తోందని నేతలు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కేవలం పులుల సంరక్షణే కాకుండా, అటవీ రక్షణకు సంబంధించిన ఇతర ఉమ్మడి ప్రయోజనాలపైనా మరింత సహకరించుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి.
🌳 కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌కు ధన్యవాదాలు
ఈ అంతరాష్ట్ర ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లడంలో, అవసరమైన అనుమతులు మంజూరు చేయడంలో తమకు నిరంతరం మార్గదర్శకత్వం వహించిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం అలాగే అటవీ భాగస్వామ్య సంస్థలతో కలిసి ఏపీ అటవీ శాఖ మరింత సమన్వయంతో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
Had a warm and productive meeting with the Hon’ble Chief Minister of Maharashtra, Shri @Dev_Fadnavis Ji. We discussed a range of issues of mutual interest and explored opportunities for greater cooperation between our two States.
I conveyed my sincere thanks to him for… pic.twitter.com/k6Vc4GADUd
— Pawan Kalyan (@PawanKalyan) June 30, 2026
