Gautam Gambhir: గంభీర్ సెలెక్షన్‌పై దుమారం.. పరువు మీరే తీసుకున్నారుగా!

Gautam Gambhir: టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమిండియా.. ఐర్లాండ్ పర్యటనలో ఘోర నిరాశను చవిచూసింది. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-2తో ఓడిపోయి అభిమానులను షాక్‌కు గురిచేసింది.

మొదటి టీ20లో 34 పరుగుల తేడాతో పరాజయం పాలైన భారత్.. రెండో మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో విజయాన్ని చేజార్చుకుంది.

రెండో మ్యాచ్‌లో భారత ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ డకౌట్ కావడం జట్టుకు భారీ దెబ్బగా మారింది. తెలుగు యువ బ్యాటర్ తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.

జట్టు ఎంపికపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాలెన్స్ లేని ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగడమే ఓటమికి ప్రధాన కారణమని మాజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

యువ సంచలనం సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడం, అభిషేక్ శర్మ ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే సూర్యకుమార్ యాదవ్‌కు బదులుగా శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ ఇవ్వడంపైనా చర్చ జరుగుతోంది.

మాజీ భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా జట్టులో అవసరానికి మించి ఆల్‌రౌండర్లను ఎంపిక చేశారని వ్యాఖ్యానించినట్లు చర్చ నడుస్తోంది.

సోషల్ మీడియాలో కూడా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “సూర్యకుమార్ కెప్టెన్‌గా ఉంటే ఇలా జరిగేదా?”, “సూర్యవంశీకి అవకాశం ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో” అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆర్టికల్ రాసినవారు.. పన్నీరు సాయికిరణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *