Malla Reddy: హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్‌లో ఎసిబి (ACB) అధికారులు మరోసారి ఏకకాలంలో సంచలన దాడులు నిర్వహించారు. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తోన్న మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో రావడంతో రంగం లోకి దిగిన ఏసీబీ బృందాలు ఆయన నివాసం, కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లోని ఆస్తులపై విస్తృతంగా సోదాలు చేపట్టాయి.
