Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

Chiranjeevi: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ‘విశేష్ జన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సోమవారం నాడు మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన కీలక విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను చిరంజీవికి వివరించిన రామచందర్ రావు, వాటికి సంబంధించిన ప్రత్యేక బుక్‌లెట్‌ను ఆయనకు అందజేశారు; మోదీ ప్రభుత్వ ప్రగతిని సమాజంలోని వివిధ రంగాల ప్రముఖులకు చేరవేసేందుకు బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సాగిస్తోన్న వరుస భేటీల్లో భాగంగానే ఈ హై-ప్రొఫైల్ సమావేశం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *