Horoscope Today:
మేషం
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. కుటుంబ సహకారం ఉత్తేజాన్నిస్తుంది.
పరిహారం: సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం శ్రేయస్కరం.
వృషభం
ముఖ్యమైన పనుల్లో పురోగతి కనబడుతుంది. అనుకున్న కార్యం సాఫీగా పూర్తి అవుతుంది. అందరినీ కలుపుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రయాణాల్లో నిర్లక్ష్యం వద్దు. కుటుంబ వాతావరణం ఆనందభరితంగా ఉంటుంది.
పరిహారం: దుర్గా ధ్యానం శుభఫలితాలను ఇస్తుంది.
మిథునం
మీ రంగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం, ఆనందం ఉంటాయి. ఆర్థిక లాభాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు, ప్రయాణ యోగం సూచితం. మిత్రుల సహకారం లభిస్తుంది.
పరిహారం: శివ నామ స్మరణ మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది.
కర్కాటకం
ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. పెద్దల సూచనలు మేలు చేస్తాయి. ఆర్థికంగా సానుకూల స్థితి ఏర్పడుతుంది. నిర్ణయాల్లో స్పష్టత ఉండాలి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.
పరిహారం: దుర్గాధ్యానం శక్తిని పెంపొందిస్తుంది.
సింహం
అనుకూల ఫలితాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పెద్దల ఆశీర్వాదం దక్కుతుంది. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. బంధువులతో సంభాషణలో మితిమీరకండి. ప్రయాణాలు లాభదాయకం.
పరిహారం: శివారాధన మనశ్శాంతినిస్తుంది.
కన్య
ఆశించిన ఫలితం సాధిస్తారు. సమయాన్ని సమర్థవంతంగా వినియోగించండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.
పరిహారం: దుర్గా స్తుతి ఐశ్వర్య యోగాన్ని పెంచుతుంది.
తుల
కాలం అనుకూలంగా ఉంది. గౌరవం, ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభ సూచనలున్నాయి. ధనాధాయం సంతృప్తికరంగా ఉంటుంది.
పరిహారం: లక్ష్మీ స్తుతి శుభఫలితాలను ప్రసాదిస్తుంది.
వృశ్చికం
సత్కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో మీకు అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. తోటి వారితో సౌమ్యంగా మాట్లాడితే మేలు జరుగుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది.
పరిహారం: శని ధ్యానం స్థిరత్వాన్ని ఇస్తుంది.
ధనుస్సు
మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి. మీ కృషి ద్వారా అనుకూల మార్పులు వస్తాయి. ఎవ్వరి మాటలకు ప్రభావితం కావొద్దు. చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకోవద్దు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
పరిహారం: దుర్గారాధన మేలు చేస్తుంది.
మకరం
మీ మీ రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబం ఆనందంగా ఉంటుంది.
పరిహారం: ఇష్టదైవారాధన శ్రేయస్సును పెంచుతుంది.
కుంభం
శ్రమతో కూడిన ఫలితాలు లాభిస్తాయి. సహచరుల సహకారం దక్కుతుంది. బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి.
పరిహారం: గణపతి ఆరాధన శాంతినిస్తుంది.
మీనం
మొదలుపెట్టిన పనులు విజయవంతంగా ముగుస్తాయి. ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన శుభవార్త లభిస్తుంది. కుటుంబంలో ఉత్సాహం, సంతోషం ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలకు ఇది మంచి సమయం.
పరిహారం: ఇష్టదైవ స్మరణ మానసిక ఆనందాన్నిస్తుంది.
