IPL 2026 Prize Money: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. నేడు జరగబోయే ఈ మహా సంగ్రామంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు దూసుకురాగా.. క్వాలిఫయర్-1 లో గెలిచిన ఆర్‌సీబీ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.
ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌తో పాటు, విజేతగా నిలిచే జట్టుకు ఇంక రన్నరప్‌గా నిలిచే జట్లకు ఐపీఎల్ కమిటీ అందించే భారీ ప్రైజ్ మనీ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది ప్లేఆఫ్స్ చేరిన టాప్-4 జట్ల కోసం మొత్తం ₹46.5 కోట్ల భారీ ప్రైజ్ మనీని కేటాయించారు.
ఏ స్థానంలో నిలిచిన జట్టుకు ఎంత మనీ?
ఫైనల్లో గెలిచిన జట్టుకు ప్రతిష్టాత్మక ఐపీఎల్ ట్రోఫీతో పాటు భారీ నగదు బహుమతి లభిస్తుంది. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచే జట్టు కూడా ఒట్టి చేతులతో తిరిగి వెళ్లదు, వారికి కూడా కోట్ల రూపాయల వర్షం కురుస్తుంది.
| స్థానం / జట్టు | లభించే ప్రైజ్ మనీ (నగదు బహుమతి) |
| విన్నర్ (RCB లేదా GT): | రూ. 20 కోట్లు |
| రన్నరప్ (ఫైనల్లో ఓడిన జట్టు): | రూ. 13 కోట్లు |
| 3వ స్థానం (రాజస్థాన్ రాయల్స్): | రూ. 7 కోట్లు |
| 4వ స్థానం (సన్‌రైజర్స్ హైదరాబాద్): | రూ. 6.5 కోట్లు (US$ 1.2 మిలియన్లు) |
గమనిక: ఐపీఎల్ నిబంధనల ప్రకారం, 5 నుండి 10వ స్థానాల్లో నిలిచిన జట్లకు ఎలాంటి అధికారిక ప్రైజ్ మనీ లభించదు. అయినప్పటికీ, ఈ ఫ్రాంచైజీలు టిక్కెట్ల అమ్మకాలు, స్పాన్సర్‌షిప్‌లు ఇంకా బ్రాడ్‌కాస్టింగ్ (ప్రసార) హక్కుల ద్వారా భారీగానే ఆదాయాన్ని ఆర్జిస్తాయి.
రూల్స్ తెలుసా? ప్రైజ్ మనీలో ఆటగాళ్ల వాటా ఎంత?
ఐపీఎల్ నిబంధనల ప్రకారం లభించిన మొత్తం ప్రైజ్ మనీ అంతా ఫ్రాంచైజీ యజమానులకే చెందదు. గెలుచుకున్న ప్రైజ్ మనీలో 50% వాటాను జట్టులోని ఆటగాళ్లకు సమానంగా పంచుతారు. మిగిలిన 50% వాటా మాత్రమే ఫ్రాంచైజీ యజమానుల (Owners) ఖాతాలోకి వెళ్తుంది. దీనివల్ల టైటిల్ గెలవడం ద్వారా కేవలం మేనేజ్‌మెంట్‌కు మాత్రమే కాకుండా మైదానంలో కష్టపడిన ప్లేయర్లకు కూడా నేరుగా భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది.
అవార్డుల విజేతలకు ప్రత్యేక బహుమతులు
జట్లతో పాటు వ్యక్తిగత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు కూడా ఐపీఎల్ భారీ నజరానాలను అందిస్తుంది:
-
ఆరెంజ్ క్యాప్ విజేత (అత్యధిక పరుగులు): రూ. 10 లక్షలు
-
పర్పుల్ క్యాప్ విజేత (అత్యధిక వికెట్లు): రూ. 10 లక్షలు
-
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ (ఉత్తమ యువ ఆటగాడు): రూ. 20 లక్షలు
-
ఇతర ప్రత్యేక అవార్డులు: ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున నగదు లభిస్తుంది.
