Siddaramaiah

Siddaramaiah: ముగిసిన సస్పెన్స్.. డీకే శివకుమార్‌తో కలిసి వెళ్లి రాజీనామా చేసిన సిద్ధరామయ్య

Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో గురువారం ఒక పెద్ద ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. దీంతో కర్ణాటకలో నాయకత్వ మార్పు అధికారికంగా ఖరారైంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తన పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గురువారం మధ్యాహ్నం సిద్ధరామయ్య తన సహచర నేత, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్న అధికారిక పత్రాన్ని వారు వెంట తీసుకెళ్లారు. అయితే, ఆ సమయంలో లోక్‌భవన్‌లో గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌ అందుబాటులో లేరు. దాంతో సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యదర్శికి అందజేశారు.

ఈ రాజీనామాతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేక అధిష్ఠానం మరో కొత్త పేరును తెరపైకి తెస్తుందా అనే ఉత్కంఠ రేపుతోంది. రాబోయే రోజుల్లో కర్ణాటక రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *