Peddi Premieres

Peddi Premieres: నిజాం ప్రీమియర్స్ పై వీడని సస్పెన్స్.. ఫ్యాన్స్‌లో పెరుగుతున్న టెన్షన్!

Peddi Premieres: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో టాలీవుడ్‌లో హీట్ ఒక్కసారిగా పెరిగింది. సినిమా థియేటర్లలోకి రావడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, మరోవైపు నిజాం (తెలంగాణ) ప్రాంతంలో ఈ చిత్ర ప్రీమియర్ షోల విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఒకవైపు చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉండగా.. ఇంకోవైపు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపుపై జరుగుతున్న చర్చలు అభిమానులను కాస్త టెన్షన్‌కు గురిచేస్తున్నాయి.

ముగిసిన నార్త్ టూర్.. పోస్ట్ ప్రొడక్షన్‌లో బుచ్చిబాబు బిజీ!

సినిమా ప్రమోషన్ల విషయంలో మేకర్స్ ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే ముంబై, భోపాల్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్లను నిర్వహించి, నేషనల్ వైడ్ గా సినిమాపై గట్టి బజ్ క్రియేట్ చేశారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ ల జోడీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలతో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే, దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదలకు ముందే డబ్బింగ్, ఫైనల్ మిక్సింగ్ తో పాటు మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటినీ శరవేగంగా ముగించే పనిలో నిమగ్నమైనట్లు ఇండసైడ్ టాక్.

ఆంధ్రాలో లైన్ క్లియర్.. తెలంగాణలోనే అసలు చిక్కు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘పెద్ది’ టికెట్ రేట్లు, స్పెషల్ షోల పరిస్థితిని పరిశీలిస్తే భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది:

  • ఆంధ్రప్రదేశ్‌లో సానుకూలం: ఏపీలో ప్రత్యేక షోల అనుమతులు ఇంకా టికెట్ ధరల పెంపు పెద్ద సమస్య కాకపోవచ్చని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్లికేషన్లు ఇప్పటికే ప్రభుత్వ పట్టికలోకి వెళ్లాయని, విడుదలకు రెండు మూడు రోజుల ముందే జీవో (GO) వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

  • తెలంగాణలో అనిశ్చితి: అసలు సమస్య అంతా నిజాం (తెలంగాణ) ఏరియాలోనే ఉంది. ప్రస్తుతం నడుస్తున్న ‘పర్సంటేజ్’ వివాదం (Percentage Issue) కారణంగా థియేటర్ ఎగ్జిబిటర్లు టికెట్ ధరల పెంపును, అర్ధరాత్రి బెనిఫిట్ షోలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ఈ ఇష్యూ ఇంకా నలుగుతుండటంతో.. విడుదలకు ముందు ప్రత్యేక ప్రీమియర్లకు ప్రభుత్వం నుండి అనుమతులు లభిస్తాయా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.

స్పాయిలర్స్ భయం.. మేకర్స్‌పై ఒత్తిడి!

ఈ రోజుల్లో పెద్ద సినిమాలకు సోషల్ మీడియా లీకులు, ట్విట్టర్ రివ్యూలు పెద్ద మైనస్ గా మారుతున్నాయి. ఒకచోట ముందే షో పడితే.. ఆ స్పాయిలర్స్ మిగతా ప్రాంతాల కలెక్షన్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే అన్ని చోట్లా ఒకేసారి ప్రీమియర్లు పడాలని, నిజాంలో కూడా ఇష్యూ త్వరగా సెటిల్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చివరి నిమిషంలో ఎలాంటి గందరగోళం లేకుండా ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్మాత సతీష్ కిలారుపై ఒత్తిడి పెరుగుతోంది.

ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ‘పెద్ది’ అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వచ్చిందని, సినిమాపై పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయని టాక్. ఒకవేళ ఆఖరి వారంలో ఈ వివాదాలన్నీ సర్దుమణిగి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రీమియర్లకు అనుమతి వస్తే.. బాక్సాఫీస్ వద్ద చరణ్ కెరీర్‌లోనే మైండ్ బ్లోయింగ్ ఓపెనింగ్స్ నమోదు కావడం ఖాయం. మరి ఈ చివరి వన్ వీక్‌లో మేకర్స్ పరిస్థితిని ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *