Anirudh And Kavya

Anirudh And Kavya: స్పెయిన్‌లో అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లి ?

Anirudh And Kavya: సౌత్ ఇండియన్ సినీ ఇంకా స్పోర్ట్స్ సర్కిల్స్‌లో ప్రస్తుతం ఒక టాప్ సెలబ్రిటీ వెడ్డింగ్ న్యూస్ విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్ కావ్య మారన్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. వీరిద్దరూ ఈ ఏడాది చివర్లోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

న్యూయార్క్ వీధుల నుండి స్పెయిన్ రిసార్ట్ వరకు..

టాప్ మ్యూజిక్ కంపోజర్‌గా అనిరుధ్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ ఉండగా.. కావ్య మారన్ ఐపీఎల్ మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ద్వారా క్రికెట్ ప్రేమికుల్లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.

గతంలో వీరిద్దరూ అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించడంతో.. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే అనుమానాలు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం, వీరి వివాహం భారతదేశంలో కాకుండా ఒక గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లా ప్లాన్ చేస్తున్నారట. ఈ వేడుకల కోసం ఒక లగ్జరీ రిసార్ట్‌ను ఫైనల్ చేయడానికి కావ్య మారన్ ఇటీవలే స్పెయిన్ దేశానికి కూడా వెళ్లి వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

ఈ లవ్ అండ్ మ్యారేజ్ రూమర్స్ నెట్టింట ఇంతలా వైరల్ అవుతున్నప్పటికీ.. అటు అనిరుధ్ కానీ, ఇటు కావ్య మారన్ కానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. ఇరు కుటుంబాల నుండి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *